AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిః హోంమంత్రి దిలీప్ వాల్సే

రాష్ట్రంలోని అన్ని మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను అమర్చాలంటే.. పోలీసుల అనుమతి తప్పనిసరి చేసింది.

Maharashtra: మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిః హోంమంత్రి దిలీప్ వాల్సే
Home Minister Dilip Walse Patil
Balaraju Goud
|

Updated on: Apr 18, 2022 | 1:48 PM

Share

Loudspeakers at all Religious Places: మహారాష్ట్ర(Maharashtra)లో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే(Raj Thackeray) లౌడ్ స్పీకర్ బెదిరింపుల కారణంగా మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ మోడ్‌లో కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను అమర్చాలంటే..  పోలీసుల అనుమతి తప్పనిసరి చేసింది. అన్ని మతపరమైన ప్రదేశాలు లేదా మతపరమైన కార్యక్రమాలలో ఏదైనా అనధికారికంగా లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ఉల్లంఘించిన వారిపై కఠిన చర్చలు ఉంటాయన్నారు. దీనితో పాటు లౌడ్ స్పీకర్లకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో నిర్ణయిస్తామని రాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్(Dilip Walse Patil) స్పష్టం చేశారు. లౌడ్ స్పీకర్లకు సంబంధించి గైడ్‌లైన్‌ను రాష్ట్ర పోలీసులు, ముంబై కమిషనర్ కూర్చుని నిర్ణయిస్తారని మహారాష్ట్ర హోం మంత్రి తెలిపారు.

రాజ్ థాకరే మరోసారి పూణే వేదికగా మహారాష్ట్ర సర్కార్‌కు అల్టిమేటం ఇచ్చారు. మే 3 వరకు ప్రార్థనా మందిరాలపై లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే, రాష్ట్రంలోని ప్రధాన కూడలిల్లో హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. ఇది వివిధ వర్గాల నుండి వచ్చిన ఫిర్యాదులేనని రాజ్ థాకే ఆదివారం తెలిపారు. మతపరమైన కార్యకలాపాలకు వ్యతిరేకం కాదాని, ప్రజలందరికీ సామాజిక, ఆరోగ్యపరమైన చిక్కులను కలిగకుండా ఉండేందుకు లౌడ్ స్పీకర్ల వాడకాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ దీనిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పోలీసు కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చారు. బీటిల్స్‌కు సంబంధించి ఉమ్మడి పాలసీని రూపొందించాలని రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఆదేశించారు. జాతి విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందిస్తారని హోం మంత్రి తెలిపారు. ‘రెండు రోజుల్లో రాష్ట్రానికి సమైక్య విధానాన్ని నిర్ణయిస్తామన్నారు. ముంబైతో సహా రాష్ట్రానికి నోటిఫికేషన్ జారీ చేస్తామని, నియమ, నిబంధనలు ప్రకటిస్తామన్నారు.

Read Also… Venkaiah Naidu: పంచాయతీ నుంచి పార్లమెంట్‌ దాకా.. ప్రజాప్రతినిధుల వాడుతున్న భాషపై సమీక్ష జరగాలిః వెంకయ్య నాయుడు