Tiger attack: మందుకొడుతున్న ఫ్రెండ్స్‌.. అకస్మాత్‌గా వచ్చిన పులి.. ఏం జరిగిందంటే..

|

Dec 26, 2022 | 1:51 PM

Tiger attack: స్నేహితులు పార్టీ చేసుకోవడానికి ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటారు. కొంతమంది ఊరవతల నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో పార్టీలు చేసుకుంటుంటారు. అయితే జంతువులు సంచరించే చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని కొంతమంది యువకులు మాత్రం..

Tiger attack: మందుకొడుతున్న ఫ్రెండ్స్‌.. అకస్మాత్‌గా వచ్చిన పులి.. ఏం జరిగిందంటే..
Tiger (File Photo)
Follow us on

Tiger attack: స్నేహితులు పార్టీ చేసుకోవడానికి ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటారు. కొంతమంది ఊరవతల నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో పార్టీలు చేసుకుంటుంటారు. అయితే జంతువులు సంచరించే చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని కొంతమంది యువకులు మాత్రం.. ఎక్కడా చోటు లేనట్టు అడవిలో సిట్టింగ్‌ వేశారు. ఫ్రెండ్స్‌ అంతా కలిసి మందు సేవిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఊహించని సీన్‌ ఎదురైంది. మందుకొడుతున్న ఆ వ్యక్తుల దగ్గరకు ఓ పెద్దపులి వచ్చింది. ఊహించని పరిణామానికి ఆ వ్యక్తులు బెంబేలెత్తిపోయారు. అందరూ తలో దిక్కూ పరుగులు తీశారు. కానీ దురదృష్టం ఓ వ్యక్తి మాత్రం పులికి ఆహారమైపోయాడు. ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న నసీఫ్‌ అనే 32 ఏళ్ల వ్యక్తిని అకస్మాతుగా వచ్చిన పులి ఈడ్చుకెళ్లిం సగం తిని వదిలేసింది. రామ్‌నగర్ అడవిలో డిసెంబర్‌ 24 సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు నఫీస్‌ కోసం గాలించారు. బ్రిడ్జికి 150 మీటర్ల దూరంలో డిసెంబర్‌ 25 ఉదయం పులి సగం తిని వదిలేసిన అతని మృతదేహం లభ్యమైంది. అయితే ఇది కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతమని, తరచూ పులులు ఇక్కడ సంచరిస్తాయని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు ఈ ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు.

సరదాగా ఎంజాయ్ చేయడం తప్పుకాదు. కాని ఏ ప్రదేశంలో ఎలాంటి పని చేయాలో క్లారిటీ ఉండాలి. అడవి అంటే జంతువులు సంచరించే అవకాశం ఉంటుంది. సమీప గ్రామ ప్రజలే కావడంతో ఆ ప్రాంతంలో పులులు సంచరించే అవకాశం ఉండొచ్చనే అవగాహన ఉండి ఉండవచ్చు. అయినా అడవిలో మందు పార్టీ చేసుకుని.. ఓ వ్యక్తి పులికి ఆహారం కావడంతో.. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ అటవీ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..