AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర అడవిలో తల్లితో పాటు అవి కూడా ..

మహారాష్ట్రలో అటవీ ప్రాంతలో మూడు పులులు ఒకేసారి చనిపోవడం కలకలం రేపింది. తన రెండు పిల్లలతో పాటు తల్లి పులి చనిపోయి ఉండటాన్ని స్ధానికులు గుర్తించారు. ఈ ఘటన చంద్రాపూర్ చిరుమూర్ ఫారెస్ట్ రేంజ్‌లో మెటాపర్ గ్రామంలో జరిగింది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్దలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన రెండు పులిపిల్లల వయసు 8 నుంచి 9 నెలల మధ్యలోనే ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే ఇదే ప్రదేశంలో […]

మహారాష్ట్ర అడవిలో  తల్లితో పాటు అవి కూడా  ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 08, 2019 | 7:17 PM

Share

మహారాష్ట్రలో అటవీ ప్రాంతలో మూడు పులులు ఒకేసారి చనిపోవడం కలకలం రేపింది. తన రెండు పిల్లలతో పాటు తల్లి పులి చనిపోయి ఉండటాన్ని స్ధానికులు గుర్తించారు. ఈ ఘటన చంద్రాపూర్ చిరుమూర్ ఫారెస్ట్ రేంజ్‌లో మెటాపర్ గ్రామంలో జరిగింది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్దలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన రెండు పులిపిల్లల వయసు 8 నుంచి 9 నెలల మధ్యలోనే ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే ఇదే ప్రదేశంలో ఇటీవల ఒక లేడి కూడా చనిపోయిందని, అయితే దానికి రెండు కాళ్లు విరిగిపోయి ఉన్నాయని స్ధానికులు చెబుతున్నారు.

ఒకేసారి తల్లితో పాటు తన రెండు పసి కూనలు మరణించడంపై అధికారులు దృష్టి సారించారు. వీటి మృతికి కారణమేంటనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us