AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకోట్‌లో జరిగిన చిత్రమైన సంఘటన. ఆ ఊళ్లో కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు.. పేరుకు తగ్గట్టుగానే అతగాడు ముగ్గురిని వివాహమాడాడు.. ఇది అతగాడి కోరిక కాదు.. ఈ ముగ్గురి అభిలాష అది!

ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు
Balu
|

Updated on: Nov 06, 2020 | 5:19 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకోట్‌లో జరిగిన చిత్రమైన సంఘటన. ఆ ఊళ్లో కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు.. పేరుకు తగ్గట్టుగానే అతగాడు ముగ్గురిని వివాహమాడాడు.. ఇది అతగాడి కోరిక కాదు.. ఈ ముగ్గురి అభిలాష అది! అతడిని పెళ్లాడిన వారు శోభ, రీనా, పింకీ. ఈ ముగ్గురూ రక్తంపంచుకుపుట్టిన అక్కా చెల్లెళ్లు.. చిన్నప్పట్నుంచి ఏం చేసినా కలిసే చేసేవారట! డిగ్రీ కూడా కలిసే పూర్తి చేశారు.. ఇప్పటి వరకైతే కలిసేవున్నాం.. రేపొద్దున పెళ్లి అయితే తలోదిక్కుకు వెళ్లాల్సిందే కదా అని తెగ వర్రీ అయ్యారు అక్కాచెల్లెళ్లు.. ఆనక ఓ నిర్ణయానికి వచ్చారు.. ముగ్గురూ ఒకరినే పెళ్లి చేసుకుంటే కలిసే ఉండే అవకాశం ఉంటుంది కదా అనుకున్నారు.. వెంటనే కలిసికట్టుగా ఒకేసారి పెళ్లిపీటలెక్కారు.. ఒక్కరితో తాళికట్టించుకున్నారు.. సారీ యూపీలో తాళి ఉంటుందో లేదో..! దండలు మార్చుకున్నారు.. ఈ వివాహ వేడుక జరిగి పుష్కరకాలం దాటింది.. ఇప్పటికీ అందరూ హాయిగా ఆనందంగా ఎలాంటి అరమరికలు లేకుండా కాపురం చేసుకుంటున్నారు.. ఈ ముగ్గురికీ ఇద్దరేసి పిల్లలున్నారు. వీరంతా కంసీ రామ్‌కాలనీలో ఉంటున్నారు. మొన్న కర్వా చౌత్‌ పండగయ్యింది కదా! ఆ పండుగ సందర్భంగా ముగ్గురూ ఒకే జల్లెడలోంచి తమ ముద్దుల మొగుడుని చూసి సంబరపడిపోయారు. అక్కాచెల్లెళ్లు ఉన్నత విద్యను అభ్యసించారని, వారెప్పుడూ విడిగా ఉందామనుకోలేదని సోదరిత్రయం బంధువు ఒకరు చెప్పారు. కలసి ఉంటే కలదుసుఖం అన్న సూక్తిని మనసారా నమ్మినవారన్నారు. అసలు ఒకే వేదికపై ఈ ముగ్గురిని ఎలా పెళ్లి చేసుకున్నాడన్నది మాత్రం కృష్ణ చెప్పడం లేదు.. క‌ర్వా చౌత్ సంద‌ర్భంగా భ‌ర్త సుఖసంతోషాలను కోరుతూ ముగ్గురు భార్య‌లు ఉప‌వాసం ఉండి, సాయంత్రం చంద్రుడికి పూజలు చేశారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడను తెరగా చేసుకుని భర్తను చూశారు. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.