ఇక, ‘వాట్సాప్ పే’.! ఎలాంటి రుసుము వసూలు చేయం: ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్
మరో డిజిటల్ పేమెంట్ ఫ్లాట్ ఫాం భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వలే డబ్బులు పంపించుకునే వెసులుబాటును వాట్సాప్ (వాట్సాప్ పే) కూడా కల్పించనుంది. వాట్సప్ పే ప్రారంభించేందుకు భారతదేశం ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ పేమెంట్స్ సర్వీస్ ద్వారా మల్టీ బ్యాంక్ ఏకీకృత చెల్లింపులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. అమెరికాకు చెందిన వాట్సాప్ పే 20 మిలియన్ల యూజర్లతో సేవల్ని ప్రారంభించనుంది. ఫేస్‌బుక్ […]

మరో డిజిటల్ పేమెంట్ ఫ్లాట్ ఫాం భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వలే డబ్బులు పంపించుకునే వెసులుబాటును వాట్సాప్ (వాట్సాప్ పే) కూడా కల్పించనుంది. వాట్సప్ పే ప్రారంభించేందుకు భారతదేశం ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ పేమెంట్స్ సర్వీస్ ద్వారా మల్టీ బ్యాంక్ ఏకీకృత చెల్లింపులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. అమెరికాకు చెందిన వాట్సాప్ పే 20 మిలియన్ల యూజర్లతో సేవల్ని ప్రారంభించనుంది. ఫేస్‌బుక్ సంస్థ..వాట్సప్ పేమెంట్స్‌ను భారత్ లో ప్రారంభించేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. రెగ్యులేటరీ సమస్యలతో పైలట్ ప్రాజెక్టు పరిమితమైన యూజర్లకే ఆగిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో వాట్సాప్ పే ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి బీటా టెస్టింగ్ ప్రారంభించింది వాట్సాప్. భారత్ లో డిజిటల్ పేమెంట్స్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్‌ను భారత్ లో ప్రారంభించనుంది. ఈ సేవలకు గాను వాట్సాప్ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయదని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.



