Odisha Train Accident: రాత్రి 8.30ని. లకు పట్టాలు తప్పిన రైలు.. ప్రమాదంలో దెబ్బతిన్న మూడు బోగీలు..

. టెక్నికల్ ఇష్యూస్‌, మానవ తప్పిదాల కారణంగా తరచూ ఇలాంటి రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఈ వార్త ఒక్కసారిగా యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.. ఎందుకంటే గతంలో జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన ఇప్పటికీ దేశం మర్చిపోలేదు. ఈ క్రమంలోనే ఒడిశాలో తాజాగా మరో రైలు పట్టాలు తప్పిన వార్త వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Odisha Train Accident: రాత్రి 8.30ని. లకు పట్టాలు తప్పిన రైలు.. ప్రమాదంలో దెబ్బతిన్న మూడు బోగీలు..
Odisha Train Accident

Updated on: Feb 22, 2025 | 1:12 PM

గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రజలు, ప్రయాణికుల్ని భయాబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని రైళ్లు పట్టాలు తప్పడం, ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం, ట్రైన్లలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో వింటున్న ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.. టెక్నికల్ ఇష్యూస్‌, మానవ తప్పిదాల కారణంగా తరచూ ఇలాంటి రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఈ వార్త ఒక్కసారిగా యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.. ఎందుకంటే గతంలో జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన ఇప్పటికీ దేశం మర్చిపోలేదు. ఈ క్రమంలోనే ఒడిశాలో తాజాగా మరో రైలు పట్టాలు తప్పిన వార్త వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఫిబ్రవరి 21 రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాయ్‌పూర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు మూడు కోచ్‌లు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ప్రమాదంలో మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకలేదని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ప్రమాద సమాచారం అందుకున్న తూర్పు కోస్తా రైల్వే అధికారులు, సంబల్పూర్ డీఆర్ఎం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. దెబ్బతిన్న బోగీలను ట్రాక్ నుంచి తొలగించి మార్గాన్ని పునరుద్ధరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..