ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బంపరాఫర్‌! ముందుగానే నెల జీతాల చెల్లింపులు

|

Oct 18, 2022 | 12:18 PM

కోవిడ్‌ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పండుగల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాదైనా పండగలను అట్టహాసంగా జరుపుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వారికి సహాయంగా ఈ నెల జీతం ముందుగానే చెల్లించాలని ప్రభుత్వం..

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బంపరాఫర్‌! ముందుగానే నెల జీతాల చెల్లింపులు
Salary
Follow us on

పండుగల సీజన్‌లో మామూలు కంటే కొంచెం ఎక్కవ ఖర్చులు ఉంటాయి. ఒక్కోసారి జీతం సరిపోక అప్పులు చేసే వారు కూడా ఉంటారు. ఇక ఈ నెల (అక్టోబరు) 24న దీపావళి పండుగ ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకోవడం దేశ ప్రజలకు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి వారికి విందుతోపాటు బహుమతులు కూడా ప్రదానం చేస్తుంటారు. వీటన్నింటికీ భారీగా ఖర్చు అవుతుంది. దీపావళి పండగకు ఇంకా వారం రోజులు కూడా లేవు. ఇక ఈ నెల జీతం వచ్చే నెల ఒకటో తారీఖున గానీ చేతికి అందదు. ఇలాంటి సమయంలో ఉద్యోగులు డబ్బుకోసం తడుముకోకుండా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పండగ సమయం కంటే చాలా ముందుగా జీతాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌ ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నెలకు గానూ చెల్లించవల్సిన జీతాలను ముందుగానే అంటే అక్టోబర్‌ 20 నుంచే అందజేస్తు్నాం. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కోవిడ్‌ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పండుగల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాదైనా పండగలను అట్టహాసంగా జరుపుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వారికి సహాయంగా ఈ నెల జీతం ముందుగానే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని మంత్రి చౌదరి తెలిపారు.