వివాదాస్పదమైన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని అమ్మేస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ హెచ్ఛరించారు. బెంగుళూరును ఢిల్లీ తరహాలో ఘెరావ్ చేయాలని, అన్ని వైపుల నుంచి ముట్టడించాలని ఆయన అన్నారు .కర్ణాటకలోని శివమొగా లో అన్నదాతలు నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆయన.. లక్షలాది రైతులు ఢిల్లీని ఘెరావ్ చేస్తున్నారని, ఈ ఆందోళన చాలాకాలం పాటు కొనసాగుతుందని చెప్పారు. మూడు నల్ల చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసేంతవరకు ప్రతి రాష్ట్రంలో, నగరంలో ఈ నిరసన కొనసాగవలసి ఉందని ఆయన చెప్పారు. కర్ణాటకలో కూడా ఇలా నిరసన పెల్లుబుకాలని, మీ భూమిని లాక్కోవడానికి, దాన్ని బడా కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తికాయత్ పేర్కొన్నారు. ఈ రాష్ట్ర రైతులు ప్రేక్షక పాత్ర వహించడం మానాలన్నారు. చీప్ లేబర్ విధానానికి అనువుగా కార్మిక చట్టాలను సవరిస్తున్నారన్నారు. వచ్చే 20 ఏళ్ళల్లో మీరు మీ భూములను కోల్పోవడం ఖాయమన్నారు. అందువల్ల ఇప్పటినుంచే ఇక్కడ ఆందోళన మొదలు కావాలన్నారు.
సుమారు 26 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఇది ఇక్కడితో ఆగదని, అన్నదాతల ప్రయోజనాలు పెను ప్రమాదంలో పడే సూచనలున్నాయని ఆయన హెచ్చరించారు. మీ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని ప్రభుత్వం చెబుతోంది.. కానీ కనీస మద్దతు ధర చెల్లిస్తే కానీ అమ్మబోమని షరతు విధించండి అని ఆయన కోరారు. ఇప్పటికీ ఢిల్లీలో రైతులు ఇంకా ఆందోళనలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆ స్ఫూర్తి ప్రతి చోటా రావాలని తాను కోరుతున్నట్టు తికాయత్ చెప్పారు. 4 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని, సభ ప్రాంగణంలోనే విత్తనాలు వేసి పంటలు పండిస్తామని ఆయన ఇదివరకు చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే విషయాన్నీ చెబుతున్నానన్నారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video
మార్స్ పై నీటిజాడ..గురించి సంచలన నిజాలు వెల్లడించిన నాసా : water on Mars Video
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Video