Covid Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ముగిసేది ఎప్పుడంటే..? IIT కాన్పూర్ ప్రొఫసర్ అంచనా ఇది..

|

Jan 10, 2022 | 1:44 PM

Covid Third Wave: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో నిత్యం లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Covid Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ముగిసేది ఎప్పుడంటే..? IIT కాన్పూర్ ప్రొఫసర్ అంచనా ఇది..
Covid 19 Third wave
Follow us on

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో నిత్యం లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారంనాడు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గత 24 గం.ల్లో దేశంలో 1,79,723 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619గా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 13.29శాతం ఉంది. ముందు ముందు రోజువారీ కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? థర్డ్ వేవ్ ఎప్పుడు పీక్ స్టేజ్‌కి చేరుతుంది? ఎప్పుటి వేవ్ ముగియనుంది? అనే అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై పలువురు నిపుణులు వివిధ రకాలుగా అంచనాలువేస్తున్నారు. IIT Kanpurలో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫసర్‌గా పనిచేస్తున్న మనీంద్ర అగర్వాల్.. థర్డ్ వేవ్‌పై తన అంచనాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య, వైరస్ ఎన్ని రెట్లు వేగంగా వ్యాపిస్తోంది?.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని గణిత విశ్లేషణలతో ఆయన ఈ అంచనాలు వేశారు. దీని ప్రకారం జనవరి నెల మధ్యలో ఢిల్లీ, ముంబైలో థర్డ్ వేవ్ పీక్‌కు చేరే అవకాశముందని అంచనావేశారు. మూడో వారం నుంచి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య దిగివచ్చే అవకాశముందని తెలిపారు.

అలాగే శంలో థర్డ్ వేవ్ కర్వ్ వచ్చే నెల(ఫిబ్రవరి) ప్రారంభంలో పీక్‌కు చేరొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు. వేవ్ పీక్‌లో ఉన్నప్పుడు దేశంలో మొత్తం రోజువారీ కేసుల సంఖ్య 4 నుంచి 8 లక్షల వరకు నమోదుకావచ్చని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం తర్వాత కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు. మార్చి నెల మధ్యనాటికల్లా దేశంలో థర్డ్ వేవ్ దాదాపుగా ముగిసే అవకాశమున్నట్లు అంచనావేశారు.

ఎన్నికల ర్యాలీలతో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం లేదని చెప్పలేమన్న మనీంద్ర అగర్వాల్.. వైరస్ వ్యాప్తికి దోహదపడే ఇతర బలమైన కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. గిలిన దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా కేసులకు సంబంధించి ప్రభుత్వాలు ఇస్తున్న డేటా నాణ్యత మెరుగైనదిగా అభిప్రాయపడ్డారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా కోవిడ్ డేటా నాణ్యత విషయంలో మనకంటే వెనుకబడ్డాయని చెప్పారు.

జనాభా సంఖ్య, వ్యాధి నిరోధకశక్తి పరంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య సారూప్యతలు ఉన్నాయన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో దక్షిణాఫ్రికాలో ఏం జరిగిందో.. అదే భారత్‌లో కూడా జరుగుతుందని అంచనావేస్తున్నట్లు వివరించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని.. భారత్‌లో కూడా దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనావేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read..

India Corona Cases: ఊరట.. దేశంలో భారీగా తగ్గిన మరణాలు.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం భారీగానే

TS Corona Virus: ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కల్లోలం.. 11 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్..

Tirumala Darshan: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కరోనా నిబంధనలను మరింత కఠినం చేసిన టీటీడీ..