Covid 19 Third wave: అప్పటి వరకు థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం.. కరోనా కేసులపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీఎంఆర్‌

|

Feb 05, 2022 | 1:33 PM

Covid 19 Third Wave: గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కారణంగా భారీగానే పాజిటివ్‌ కేసులు,..

Covid 19 Third wave: అప్పటి వరకు థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం.. కరోనా కేసులపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీఎంఆర్‌
Follow us on

Covid 19 Third Wave: గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కారణంగా భారీగానే పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చింది. దీంతో వ్యాక్సిన్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక థర్డ్‌వేవ్‌ తగ్గుముఖంపై ఐసీఎంఆర్‌ (ICMR) కీలక వ్యాఖ్యలు చేసింది. మార్చి నాటికి థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతుందని తెలిపింది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ్ బెంగాల్‌లో థర్డ్ వేవ్ ఫిబ్రవరి చివరినాటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి కోవిడ్‌ కేసులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వచ్చే మూడు, నాలుగు వారరాల్లో దేశంలో థర్డ్‌వేవ్‌ ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

అయితే మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా కేసుల తీరును అంచనా వేసింది ఐసీఎంఆర్‌. ఇంపీరియల్ కాలేజ్ లండన్ అభివృద్ధి చేసిన క్రోమిక్ మోడల్ ప్రకారం .. మార్చి నెల మధ్య నాటికి దేశంలో కరోనా కేసులు చివరి దశకు చేరే అవకాశం ఉంది. జనవరిలో కేసులు పెద్ద ఎత్తున నమోదై తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని సమీర్ పాండా అన్నారు. ఈ తీవ్రత ఫిబ్రవరి చివరి నాటికి తగ్గే అవకాశాలున్నాయని, మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే..

Corona: కరోనా మరణాలలో 22 శాతం వ్యాక్సిన్‌ తీసుకోని వారే.. ఐసీఎమ్‌ఆర్‌ రీసెర్చ్‌లో షాకింగ్‌ నిజాలు..