Jet Tyre Robbery: యుద్ధ విమాన టైరును దొంగలించిన దుండగులు.. ఎలా చోరీ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!

Jet Tyre Robbery: ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న ట్రక్కు నుంచి యుద్ధ విమానం ఫైటర్‌ జెట్‌ టైర్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. రాజస్థాన్‌లోని లక్నో ఎయిర్‌బేస్‌

Jet Tyre Robbery: యుద్ధ విమాన టైరును దొంగలించిన దుండగులు.. ఎలా చోరీ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!
Jet

Updated on: Dec 04, 2021 | 6:10 AM

Jet Tyre Robbery: ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న ట్రక్కు నుంచి యుద్ధ విమానం ఫైటర్‌ జెట్‌ టైర్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. రాజస్థాన్‌లోని లక్నో ఎయిర్‌బేస్‌ నుంచి జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌కు యుద్ధ విమానాన్ని తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ట్రక్కు డైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు ప్రాథమిక ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ చోరీకి సంబంధించి పోలీసులు, ట్రక్కు డ్రైవర్ తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ నుంచి జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌కు మిరాజ్- 2000 ఫైటర్‌ జైట్‌ను రాత్రి ట్రక్కులో తీసుకెళ్లారు. అయితే అర్ధరాత్రి 12 గంటల 30నిమిషాల నుంచి 1గంటల వరకు షహీద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ట్రక్కు నెమ్మదిగా ముందుకు కదులుతుండడంతో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు చాకచక్యంగా టైరును అపహరించారు. కాగా దొంగలు టైరును కట్టేందుకు ఉపయోగించే పట్టీని ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని ట్రక్‌ డ్రైవర్‌ చెబుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షహీద్‌ మార్గంలోని CCTV పుటేజీలన్నింటినీ పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు.

Also read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!