‘వాళ్ళు బుల్ డోజర్లతో రాలేదు’, కంగనా రనౌత్

ముంబైలోని తన మణికర్ణికా ఫిలిమ్స్ కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తామని బెదిరించారని ఓ వీడియో ద్వారా తెలిపిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తాజా అప్డేట్ ఇచ్చింది.

'వాళ్ళు బుల్ డోజర్లతో రాలేదు', కంగనా రనౌత్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Sep 08, 2020 | 1:06 PM

ముంబైలోని తన మణికర్ణికా ఫిలిమ్స్ కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తామని బెదిరించారని ఓ వీడియో ద్వారా తెలిపిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తాజా అప్డేట్ ఇచ్చింది. ఆ ఆఫీసును వారు కూల్చివేయలేదని, ఇందుకు బదులు ఆఫీసులో లీకేజీ అవుతోందని, దాన్ని ఆపాలంటూ నోటీసు అంటించి వెళ్లారని ఆమె ట్వీట్ చేసింది. తన స్నేహితుల నుంచి, సోషల్ మీడియాలోని తన సన్నిహితుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు తోకముడిచారని కంగనా పేర్కొంది. నా ఫ్రెండ్స్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని ఆమె వెల్లడించింది.

అటు-మూవీ మాఫియాపై కంగనా తీవ్ర స్థాయిలో ట్వీట్లు చేసింది. ‘మీ గట్టి ఫ్రెండ్స్ తో మా ఇంట్లో విధ్వంసం సృష్టించవచ్ఛు.. అయితే నా అంతం అన్నది నాంది అని గుర్తించండి.. మీరు ఇక్కడ నా  అంతం చూస్తే మరో చోట నేను మళ్ళీ ఉత్తుంగ తరంగంలా పైకి లేస్తాను’ అని ఆమె హుంకరించింది. ఇది మీకే నష్టం అని పనిలో పనిగా వార్నింగ్ ఇచ్చింది కూడా !