నటికి కాంగ్రెస్ నేత క్షమాపణలు.. వివాదం ముగిసినట్లేనా!

నటి సంయుక్త హెగ్డే, కర్ణాటక కాంగ్రెస్ నేత కవిత రెడ్డిల మధ్య గొడవ ఒక కొలిక్కి వచ్చింది. ఈ విషయంలో సంయుక్తకు కవిత రెడ్డి క్షమాపణలు చెప్పారు

  • Tv9 Telugu
  • Publish Date - 12:59 pm, Tue, 8 September 20
నటికి కాంగ్రెస్ నేత క్షమాపణలు.. వివాదం ముగిసినట్లేనా!

Samyukta Hegde News: నటి సంయుక్త హెగ్డే, కర్ణాటక కాంగ్రెస్ నేత కవిత రెడ్డిల మధ్య వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు అయ్యింది. ఈ వివాదంలో సంయుక్తకు కవిత రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆమె క్షమాపణలను అంగీకరిస్తున్నట్లు సంయుక్త తెలిపారు. ఇదంతా మరిచిపోయి ముందుకు సాగాలని, ప్రతిచోట మహిళలకు భద్రత ఉండాలని తాను కోరుకుంటున్నానని నటి వెల్లడించారు. దీంతో వివాదం ముగిసినట్లేనని అర్థమవుతోంది.

అయితే ఇటీవల ఓ పార్క్‌లో స్పోర్ట్‌వేర్‌ని ధరించి సంయుక్త, ఆమె ఫ్రెండ్‌ వ్యాయామం చేస్తుండగా.. కవిత రెడ్డిపై వీడియో తీసి, వారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సంయుక్త సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మహిళలు ఏం ధరిస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కారణాలతో వారిని హింసించడం ఇకనైనా ఆపాలి’ అని సంయుక్త కామెంట్ పెట్టారు. అంతేకాదు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై పలువురు సంయుక్తకు మద్దతును ఇచ్చారు. కాజల్ అగర్వాల్ కూడా సంయుక్తకు మద్దతును తెలుపుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Read More:

జయప్రకాష్‌ రెడ్డి మరణంపై కేసీఆర్ సంతాపం

ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. ‘సీత’గా ఎవ్వరూ ఊహించని నటి!