Agnipath Scheme: అగ్నీపథ్‌ స్కీమ్‌పై ఉన్న అపోహలు ఏంటి.? అసలు నిజాలు ఏంటి.? పూర్తి వివరాలు..

| Edited By: Ram Naramaneni

Jun 17, 2022 | 12:21 PM

Agnipath Scheme: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం 'అగ్నిపథ్‌' పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా ఆర్మీ నియామక...

Agnipath Scheme: అగ్నీపథ్‌ స్కీమ్‌పై ఉన్న అపోహలు ఏంటి.? అసలు నిజాలు ఏంటి.? పూర్తి వివరాలు..
Agnipath Scheme
Follow us on

Agnipath Scheme: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘అగ్నిపథ్‌’ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా ఆర్మీ నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికపై మిశ్రమ స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో ఎక్కువ మందిని రక్షణ రంగంలో విశాల దృక్పథంతోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కొందరు మద్ధతిస్తుంటే. మరికొందరు ఉద్యోగ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్‌ పథకం విషయంలో నెలకొన్న అపోహలు ఏంటి.? అసలు నిజాలేంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం..

అపోహ: అగ్నీవీర్‌లు భవిష్యత్తుకు రక్షణ ఉండదు.

నిజం: ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. నాలుగేళ్ల తర్వాత పదవి విరమణ పొందిన సైనికులు వ్యాపారవేత్తలుగా ఎదగడం కోసం ప్రత్యేకంగా రుణాలు అందిస్తారు. పై చదువులు చదవాలనుకునే వారి కోసం 12 తరగతి/తత్సమాన సర్టిఫికేట్‌ను అందిస్తారు. ఉద్యోగం చేయాలనుకునే వారికి CAPF, రాష్ట్ర పోలీసు శాఖలో ప్రాధాన్యత ఇస్తారు.

ఇవి కూడా చదవండి

అపోహ: అగ్నిపథ్‌ పథకం ద్వారా యువతకు అవకాశాలు తగ్గుతాయి.

నిజం: నిజానికి ఆర్మీలో పనిచేయాలనుకునే వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. ప్రస్తుతం ఆర్మీలో ఉన్న పోస్టులతో పోలిస్తే రానున్న రోజుల్లో నియామకాల సంఖ్య మూడు రెట్లు పెరుగుతాయి. కాబట్టి యువతకు అవకాశాలు తగ్గుతాయన్న దాంట్లో నిజం లేదు.

అపోహ: రెజిమెంటల్‌ ఏరియాల మధ్య బంధాలు దెబ్బతింటాయి.

నిజం: రెజిమెంటల్‌ ఏరియాల మధ్య బంధంపై అగ్నిపథ్‌ పథకం ఎలాంటి ప్రభావం చూపదు. నిజానికి అగ్నీవీర్‌ల ఎంపికతో ఈ బంధాలు మరితం బలోపేతమవుతాయి.

అపోహ: స్వల్పకాల నియామకాల ద్వారా బలగాలపై ప్రభావం పడుతుంది.?

నిజం: నిజానికి ఇలాంటి విధానాలు ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉన్నాయి, అవి విజయవంతమయ్యాయి కూడా. ఆర్మీలో చురుకైన యువకులు ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.

అపోహ: 21 ఏళ్ల వారు ఆర్మీలో చేరెంత పరిపక్వత ఉండదు.

నిజం: ప్రపంచంలోని చాలా దేశాల రక్షణ రంగాలు తమ దేశంలోని యువతపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం అమలు చేయనున్న ఈ పథకం ద్వారా 50-50 చొప్పున యువత, అనుభవం కలిగిన వారితో ఆర్మీ బలంగా మారుతుంది.

అపోహ: అగ్నివీర్‌లు సమాజానికి ప్రమాదంగా మారతారు, ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తారు.

నిజం: ఇది ముమ్మాటికీ భారత ఆర్మీని అగౌరవపర్చడమే అవుతుంది. నాలుగేళ్ల పాటు యునిఫామ్‌ ధరించిన యువత తమ జీవితాంతం వరకు దేశ రక్షణ కోసం కట్టుబడి ఉంటారు. ఇప్పటికే ఆర్మీ ఫోర్సెస్‌ నుంచి విరమణ పొందిన వేలాది మందిలో ఒక్కరు కూడా ఇలా దారితప్పిన సంఘటనలు చూడలేదు.

అపోహ: మాజీ అధికారులను సంప్రదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిజం: ఇందులో ఏమాత్రం నిజం లేదు. నిజానికి ఈ విధానానికి రూపకల్పన చేసింది మిలిటరీ ఆఫీసర్స్‌ బృందమే. చాలా మంది మాజీ ఆర్మీ అధికారులు ఈ కొత్త విధానానికి మద్ధతు పలికారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..