AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Cases: వామ్మో మహమ్మారి మళ్లీ వచ్చేసింది.. భారత్‌లో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే!

భారత్‌లో కరోనా మహమ్మారి మరో సారి కలకలం రేపింది. దేశంలో కొత్తగా కరోనా యాక్టీవ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యా శాఖ ప్రకటన జారీ చేసింది. మే 19, 2025 నాటికి దేశంలో కొత్తగా 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Covid Cases: వామ్మో మహమ్మారి మళ్లీ వచ్చేసింది.. భారత్‌లో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే!
Corona
Anand T
|

Updated on: May 20, 2025 | 12:52 AM

Share

2020లో భారత్‌లోకి అడుగుపెట్టిన కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ మాయ రోగం కారణంగా ఎంతో మంది ప్రాణాలు వదిలారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత దేశంలో కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి వచ్చాయి. ఇక ఈ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడి తేరుకుంటున్న తరుణంలో మరోసారి దేశంలో ఈ కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయని ఈ నేపథ్యంలో తాము అప్రమత్తమయ్యామని కేంద్రం ఆరోగ్యశాఖ తెలిపింది.

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకారం చూసుకుంటే ఈ నెల 12 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 164 కొత్త కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రల్లో యాక్టీవ్ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలో గత వారంలో రోజుల్లో 69 కొత్త కేసులు నమోదు కాగా. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు రిజిస్టర్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది.

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత ప్రకటన జారీ చేయబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..