AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CISF Sports Quota Constable Jobs: స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు కొలువు మీ సొంతం! నో ఎగ్జాం..

ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర లేదా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఏదైనా క్రీడలో పాల్గొన్న వారు ఎవరైనా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని.. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ లో స్పోర్ట్స్‌ కోటా కింద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది..

CISF Sports Quota Constable Jobs: స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు కొలువు మీ సొంతం! నో ఎగ్జాం..
CISF Sports Quota Constable Jobs
Srilakshmi C
|

Updated on: May 20, 2025 | 6:23 AM

Share

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌).. స్పోర్ట్స్‌ కోటా కింద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 403 సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌ అర్హతతోపాటు ఈ కింది క్రీడాంశాల్లో ప్రవేశం ఉన్న యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్‌ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

క్రీడా విభాగాలు ఇవే..

కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) 403 ఖాళీలను ఈ కింది క్రీడా విభాగాల్లో పాల్గొన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అవేంటంటే.. వుషు, త్వైకాడో, కరాటే, పెన్‌కాక్ సిలాట్, ఆర్చరీ, కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఖోఖో, వాలీబాల్‌, సెపక్‌టక్రా, బాస్కెట్‌బాల్, టెన్నిస్‌, బ్యాడ్మింటన్, సైక్లింగ్‌, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, జూడో, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్ , రెజ్లింగ్, బాడీ బిల్డింగ్‌.

పైన పేర్కొన్న క్రీడలతోపాటు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర లేదా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఏదైనా క్రీడలో పాల్గొని ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయోపరిమితి ఆగస్టు 1, 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల శారీరక ప్రమాణాలు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పురుషు అభ్యర్థుల ఎత్తు 167 సెం.మీ, మహిళా అభ్యర్థుల ఎత్తు 153 సెంటీమీటర్లు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 6, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 తప్పనిసరిగా చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ట్రయల్‌ టెస్ట్‌, ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!