AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-KISAN: రైతుల‌కు శుభ‌వార్త‌.. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడంటే?

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సాయం నిధులు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. రాబోయే నెలలో పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జూన్‌ నెలలో రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నట్టు తెలుస్తోంది.

PM-KISAN: రైతుల‌కు శుభ‌వార్త‌.. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడంటే?
Pm Kisan
Anand T
|

Updated on: May 20, 2025 | 12:08 AM

Share

భారతదేశంలో నివసించే పేద, మధ్య తరగతి ప్రజలు ముఖ్య జీవనాధారం వ్యవసాయం. వీరందూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని సార్లు వర్షాలు, కరువు వల్ల నష్టాలు వచ్చినా రైతులు వ్యవసాయాన్ని మాత్రం వదులుకోకుండా దేశంలోని ప్రజలకు ధాన్యం అందిస్తున్నారు. అలాంటి అన్నదాతలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న(PM-KISAN ) ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

అయితే ఈ ప్రధాన్ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 19 సార్లు రూ.2000 వేల కొప్పున ఎకరానికి రూ.6000 వేలు అందిస్తూ వచ్చింది. ఇప్పుడు 20వ విడత నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులను జూన్‌ నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

19వ విడత నిధులు…

అయితే ఈ పథకం కింద 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24న విడుదల చేసింది. చివరి విడతలో విడుదలైన నిధులుతో దేశంలోని 9.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. వారి ఖాతాల్లో మొత్తం రూ. 22,000 కోట్లు నిధులు జమ అయ్యాయి. అయితే 19వ విడతలో పీఎం కిసాన్ కింద లబ్ధి పొందిన రైతుల్లో 2.41 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు.

రైతుకు సూచన..

అయితే పీఎం కిసాన్ 20వ విడత నిధులు పొందాలంటే రైతులు కచ్చితంగా ఈ-కేవైసీ చేసి ఉండాలని అధికారులు చెబుతున్నారు, ల్యాండ్ డేటా సీడింగ్, బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్‌ కూడా చేసి ఉండాలని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!