Marriage Age: బిల్‌ పాస్‌ అయ్యేలోపు.. మూడు మూళ్లు వేయించేస్తున్నారు. హర్యానాలో వింత పరిస్థితి..

|

Dec 22, 2021 | 4:13 PM

Marriage Age: అమ్మాయిల చట్టబద్ధమైన వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓవైపు ప్రతిపక్షలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే లోక్‌సభ పార్లమెంటరీ స్టాండింగ్‌..

Marriage Age: బిల్‌ పాస్‌ అయ్యేలోపు.. మూడు మూళ్లు వేయించేస్తున్నారు. హర్యానాలో వింత పరిస్థితి..
Marraige Age
Follow us on

Marriage Age: అమ్మాయిల చట్టబద్ధమైన వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓవైపు ప్రతిపక్షలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే లోక్‌సభ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి నివేదించింది. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ చట్టాలను సవరిస్తూ రూపొందించిన బిల్లును మంగళవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ సభలో ప్రవేశపెట్టారు. కనీస వివాహ వయసును పెంచడం ద్వారా బాల్య వివాహాలకు అడ్డుకట్టవేయొచ్చనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం వైపు అడుగులు వేసింది. అయితే దీని ద్వారా పలు నష్టాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే.. ఈ బిల్లు చట్టరూపం దాల్చేలోపు వివాహాలు చేసేస్తున్నారు హర్యానాకు చెందిన వారు.

తాజాగా భారీగా పెరిగిన వివాహాల సంఖ్యే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. బిల్లు చట్టరూపం దాల్చితే వివాహం చేయడం చట్టరీత్య నేరమవుతుందన్న కారణంతో 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న మహిళల వివాహాలు ఉన్నఫలంగా చేసేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా నమోదైన వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 18-19ల మధ్య హర్యానాలోని మెవాట్‌ ప్రాంతంలో ఏకంగా 450 వివాహాలు జరిగాయి. వీటిలో కేవలం 180 వివాహాలు మాత్రమే అంతకు ముందు ప్లాన్‌ చేసుకున్నవి. డిసెంబర్‌ 17 ఒక్కరోజే గురుగ్రామ్‌లో 20 మంది జంటలు వివాహం కోసం కోర్టులో ఆర్జీ పెట్టుకున్నారు. సాధారణంగా రోజులో కేవలం 5 నుంచి 6 పెళ్లిళ్లు మాత్రమే జరుగుతాయి. ఇక సాధారణంగా దేవాలయాల్లో 5 నుంచి 7 వివాహాలు జరుగుతుండగా గత శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 55 వివాహాలయ్యాయి.

ఇక చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లలకు వివాహాన్ని చేసేందుకు సంబంధలు చూడడం ప్రారంభించారని తెలుస్తోంది. విద్యాభ్యసం మధ్యలో ఉన్న తమకు ఉన్నపలంగా పెళ్లి సంబంధాలు ఫిక్స్‌ చేస్తున్నట్లు కొందరు అమ్మాయిలు వాపోతున్నారు. ఒక్క మేవాట్‌ ప్రాంతంలోనే గత గడిచిన వారాంతంలో 500 వివాహాలు జరగడం గమనార్హం. వీరిలో మెజారిటీ అమ్మాయిల వయసు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండడం కొత్త చర్చకు దారి తీస్తోంది.

Also Read: Ongole Politics: ఒంగోలులో సుబ్బారావు గుప్తా కేసులో మరో ట్విస్ట్.. దాడికి పాల్పడ్డ వైసీపీ నేత సుభాని అరెస్ట్!

Parliament Winter Session: విపక్ష సభ్యుల నిరసనల మధ్య పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా

Rewind 2021: చరిత్రలో ఈ ఏడాది.. దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద ఘటనలు..