Fuel Price Diwali: గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రతి రోజూ పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ పెట్రోల్, డీజిల్ ధరలు ఓ రేంజ్‌లోదూసుకుపోయాయి. రూ. 90 దాటితేనే భయపడే పరిస్థితి నుంచి ఏకంగా లీటర్ పెట్రోల్ రూ.115 కి చేరింది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. అయితే ఇలాంటి పరిస్థితిల్లో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ. 10 తగ్గించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా ఈ సంచలన నిర్ణయంతో ఒక్కసారిగా కేంద్రం దేశం దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఉన్నట్టుండి కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది.? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నవిషయాలు ఇప్పుడు చూద్దాం..
కరోనా నాటి లాక్ డౌన్ పరిస్థితుల సమయంలో దేశంలో ఇంధన వినియోగం భారీగా తగ్గింది. అలాగే వ్యాపార కార్యకలపాలు స్థంభించడంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా తగ్గాయి. దీంతో లాక్‌డౌన్ తర్వాత కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై భారీగా ధరలను పెంచుతూ వచ్చింది. ఇక కొంతమంది కేంద్ర మంత్రులైతే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నందుకే పెట్రోల్ ధరలు పెరుగుతన్నాయన్న స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చారు. దీంతో కేంద్రంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేశాయి. ఇక కేంద్రానికి తోడుగా రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై పన్నులను పెంచుతూ పోయాయి. దీంతో రాష్ట్రాల వారీగా కూడా ధరలు పెరిగాయి.
ఇక తాజాగా దీపావళి రోజున భారీగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై ప్రజలు హర్తం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు కేంద్రంపై విమర్శలు చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయనే అంశం ఆస్తికరంగా మారింది. కేంద్రం భారీగా ధరలు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా తగ్గించక తప్పని పరిస్థితి అనివార్యంగా మారింది. కేంద్రం భారీగా ధరలు తగ్గించడంపై కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో ఏమేర పన్నులు తగ్గిస్తాయన్న ప్రశ్న మొదలైంది. ఇలా మోడీ తనదైన ఎత్తుగడతో అన్ని రాష్ట్రాలను ఇరుకున పెట్టారని పలువురు విశ్లేసిస్తున్నారు.
ఇదిలా ఉంటే కేంద్రం ఇంధన ధరలను తగ్గిస్తూ తీసుకున్ననిర్ణయంతో వ్యవసాయ చట్టాల సమయంలో కోపోద్రుక్తులైన రైతులను కూడా శాంతింపజేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డీజిల్‌పై ఒకేసారి రూ. 10 తగ్గించడంవల్ల రైతుల్లో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేసిందని అభిప్రాయపడుతున్నారు.
Low CIBIL Score: మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా..? రుణం పొందడం ఎలా..!