Lock Down Again: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌..? ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మొదలు.! మరోసారి పంజా విసురుతున్న కరోనా.. (వీడియో)

Lock Down Again: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌..? ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మొదలు.! మరోసారి పంజా విసురుతున్న కరోనా.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 04, 2021 | 9:58 AM

కరోనా థర్డ్ వేవ్ ఇంకా పొంచే ఉందా.? వరుసగా డబ్ల్యూహెచ్‌ఓ, ఎయిమ్స్‌ చేస్తున్న హెచ్చరికలు దేనికి సంకేతం? హార్డ్‌ ఇమ్యూనిటీ తగ్గిపోతుందా? నిజంగానే థర్డ్ వేవ్ రాబోతుందా? అలానే కనిపిస్తోంది తాజాగా కోవిడ్ లెక్కలు. మళ్లీ కరోనా పంజా విసురుతోంది.


కరోనా థర్డ్ వేవ్ ఇంకా పొంచే ఉందా.? వరుసగా డబ్ల్యూహెచ్‌ఓ, ఎయిమ్స్‌ చేస్తున్న హెచ్చరికలు దేనికి సంకేతం? హార్డ్‌ ఇమ్యూనిటీ తగ్గిపోతుందా? నిజంగానే థర్డ్ వేవ్ రాబోతుందా? అలానే కనిపిస్తోంది తాజాగా కోవిడ్ లెక్కలు. మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దీంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తోంది బెంగాల్‌ ప్రభుత్వం. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.

బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని సోనార్‌పూర్ మునిసిపాలిటీ ప్రాంతంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు అధికారులు. ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేసింది. అయితే కేవలం అత్యవసర సేవలు మాత్రమే పనిచేయడానికి అనుమతించారు. సోనార్‌పూర్ ప్రాంతంలో ఇప్పటివరకు 19 కంటైన్‌మెంట్ జోన్‌లను గుర్తించారు. అయితే దసరా దుర్గాపూజ మాత ఉత్సవాల తర్వాత రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
దసరా నుంచి కోల్‌కతాలో కోవిడ్ -19 కేసులు 25 శాతం పెరిగాయని బెంగాల్‌ ప్రభుత్వానికి లేఖలో పేర్కొంది ICMR.గత 24 గంటల్లో కోల్‌కతాలో మాత్రమే 248 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి.

మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

Published on: Nov 04, 2021 09:55 AM