Low CIBIL Score: మీకు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందా..? రుణం పొందడం ఎలా..!

Low CIBIL Score: ప్రస్తుతం ఉన్న రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు కార్డు కావాలంటే అంత సులభంగా..

Low CIBIL Score: మీకు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందా..? రుణం పొందడం ఎలా..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 04, 2021 | 9:10 AM

Low CIBIL Score: ప్రస్తుతం ఉన్న రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు కార్డు కావాలంటే అంత సులభంగా వచ్చేవి కావు. బ్యాంకు అధికారులు వచ్చి అన్ని అర్హుతలను చెక్‌ చేసిన తర్వాత కార్డును జారీ చేసేందుకు ప్రాసెంగ్‌ మొదలు పెట్టేది. కనీసం 15 నుంచి 20 రోజులకు కార్డు వచ్చేది. కానీ ఇప్పుడు సులభంగా క్రెడిట్‌కార్డును పొందే అవకాశం ఉంది. ఫోన్‌ల ద్వారానే కేవైసీ వివరాలు పూర్తి చేసి కేవలం వారం రోజుల్లోపే క్రెడిట్‌ కార్డు ఇంటి అడ్రస్‌కు వచ్చేస్తోంది. ఇలా కార్డు వాడుతున్నవారు సరైన సమయానికి బిల్లు చెల్లిస్తుంటే మంచి సిబిల్‌ స్కోర్‌ ఉంటుంది. లేకపోతే తగ్గుతుంది. దీంతో స్కోర్‌ ప్రభావం ఎఫెక్ట్‌ ఇతర రుణాలు తీసుకునే సమయంలో పడుతుంది. ఏదైనా ఖరీదైన ఆస్తులు, వస్తువులు, వాహనాలు కొనాలంటే రుణం తీసుకోవడం తప్పనిసరి. మరి రుణం మంజూరు కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అందులో సిబిల్‌ స్కోర్‌ ముఖ్యమైనది. అయితే, అనివార్య కారణాల వల్ల కొన్నిసార్లు సిబిల్‌ తగ్గుతుంటుంది. తెలిసో, తెలియకో చేసిన పొరపాట్లు సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంటుంది. అలాంటప్పుడు అత్యవసర పరిస్థితి ఉంటే పర్సనల్‌ లోన్ తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుంటుంది. మరి సిబిల్‌ స్కోర్‌ తగ్గితే లోన్‌ పొందడం ఎలా..?

మంచి సిబిల్‌ స్కోర్‌ అంటే ఎంత? సిబిల్‌ స్కోరును క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) నిర్వహిస్తుంది. వ్యక్తి రుణ చరిత్ర ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. పలు అంశాలను, ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా సిబిల్‌ 1000కి గానూ 550 కంటే ఎక్కువ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే రుణం మంజూరులో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఒక్కోసారి అంతకంటే తక్కువ ఉన్నా రుణం మంజూరు చేస్తారు. కానీ, వడ్డీరేటు ఎక్కువ ఉంటుంది. లేదా మంజూరు చేసే మొత్తం మన అవసరానికి సరిపోకపోవచ్చు.

సిబిల్‌ స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..? బ్యాంకులకు రుణగ్రహీతలను అంచనా వేయడానికి ఉపయోగపడే కీలక సాధనం సిబిల్‌ స్కోర్‌. స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా రుణం మంజూరవుతుంది. సిబిల్‌ స్కోర్‌ మన రుణ చరిత్రను ప్రతిబింబిస్తుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపుల వంటి ఆర్థిక లావాదేవీలను ఈ స్కోరు సూచిస్తుంది. మీ బ్యాంకుల ఖాతాల నిర్వహణను కూడా దీన్ని బట్టి అంచనా వేయవచ్చు.

వ్యక్తిగత రుణం ఎలాంటి తనఖా లేకుండానే ఇచ్చే అన్‌సెక్యూర్డ్‌ రుణం. అలాంటప్పుడు సిబిల్‌ స్కోరే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ స్కోర్‌ తక్కువగా ఉంటే వ్యక్తగత రుణం పొందడం కొంత సవాల్‌తో కూడుకున్నదనే చెప్పాలి. ఒకవేళ ఇచ్చినా.. మనం అడిగిన దాని కంటే తక్కువ రుణం ఇవ్వడం, ఎక్కువ వడ్డీరేటు, తక్కువ కాలపరిమితితో కూడిన రుణాన్ని మంజూరు చేస్తాయి బ్యాంకులు. అయితే, కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు రూ.10,000-50,000 వరకు రుణాన్ని ఇస్తున్నాయి. సిబిల్‌ స్కోర్‌ విషయంలో పెద్దగా పట్టించుకోవు. సిబిల్‌కి బదులుగా ఈ సంస్థలు మన మొబైల్‌కి ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చే ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అంచనా వేస్తాయి. కొన్ని ఫిన్‌టెక్‌లైతే.. ప్రత్యేకంగా సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉన్నవాళ్లకే రుణాలు అందిస్తున్నాయి.

సిబిల్‌ స్కోర్‌ను మెరుగు పర్చుకోవాలంటే.. సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉండి, రుణం తప్పనిసరైతే.. డిజిటల్‌ రుణ సంస్థలను ఆశ్రయించడం మేలంటున్నారు ఆర్థిక నిపుణులు. వీటి నుంచి తీసుకొని సకాలంలో చెల్లిస్తే మీ సిబిల్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. తొలిసారి రుణం తీసుకుంటున్నవారు లేదా తక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉన్నవారికి రుణం ఇవ్వడానికి సాధారణ బ్యాంకులు ఆసక్తి చూపవు. అలాంటి సందర్భంలో డిజిటల్‌ లెండర్ల నుంచి రుణం తీసుకొని సక్రమంగా చెల్లిస్తే.. మన సిబిల్‌ స్కోర్‌ పెరిగే అవకాశం ఉంది. అయితే, వీలైనంత వరకు తక్కువ మొత్తంలో రుణం తీసుకొని ఎప్పటికప్పుడు చెల్లించడం ఉపయోగకరంగా ఉంటుంది.

రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ మీ క్రెడిట్‌ స్కోర్‌ను తనిఖీ చేస్తాయి. ఎక్కువ సార్లు రుణం తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ కొద్దిగా తగ్గుతుంది. రుణదాతలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారని ఇది సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Bank Loan: కస్టమర్లకు ఈ 9 బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ వడ్డీకే రుణాలు.. పూర్తి వివరాలు..!

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి