The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’పై బెంగాల్‌లో కొనసాగుతున్న నిషేధం.. యూపీ, ఎంపీలో సినిమాకు ట్యాక్స్ ఫ్రీ..

ది కేరళ స్టోరీ సినిమా వివాదం ముదురుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్.. మరికొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ.. ఇలా కేరళ స్టోరీ అంటూ సినిమా ఇండస్ట్రీతోపాటు.. ఇటు రాజకీయాలను సైతం షేక్ చేస్తోంది. అయితే, ది కేరళ స్టోరీ సినిమాను నిషేధిస్తూ బెంగాల్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారు.

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’పై బెంగాల్‌లో కొనసాగుతున్న నిషేధం.. యూపీ, ఎంపీలో సినిమాకు ట్యాక్స్ ఫ్రీ..
The Kerala Story

Updated on: May 09, 2023 | 4:18 PM

ది కేరళ స్టోరీ సినిమా వివాదం ముదురుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్.. మరికొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ.. ఇలా కేరళ స్టోరీ అంటూ సినిమా ఇండస్ట్రీతోపాటు.. ఇటు రాజకీయాలను సైతం షేక్ చేస్తోంది. అయితే, ది కేరళ స్టోరీ సినిమాను నిషేధిస్తూ బెంగాల్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకొని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులపై పోలీసులు జులం ప్రదర్శించారు. హౌరా రంగోలి మాల్‌లో పోలీసులు, ప్రేక్షకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాము అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నామని ప్రేక్షకులు చెప్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. వాదనను దిగిన ప్రేక్షకులు పోలీసులు లాగిపారేశారు.

అటు, ది కేరళ స్టోరీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కేరళ స్టోరీ సినిమాను బ్యాన్‌ చేయాలన్న పిటిషన్‌పై ఈనెల 15న సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. కేరళ స్టోరీ సినిమాను బీజేపీ నేతలు పూర్తిగా సమర్ధిస్తుండగా విపక్ష నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో కేరళలో పాక్షిక బ్యాన్ విధించగా.. బెంగాల్‌లో మాత్రం.. సీఎం మమత సినిమాను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలాఉంటే.. ది కేరళ స్టోరీకి పలు రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ లభిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మాత్రం సినిమాకు ట్యాక్స్‌ రాయితీలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ చిత్రం మే 5న విడుదలైంది. ఆ తర్వాత వివాదాలు, నిషేధాల మధ్య ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.కోట్లకు పైగా వసూలు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..