Metro Pillar: మెట్రో పిల్లర్ కూలి.. తల్లీ కుమారుడు మృతి.. బైక్ పై ఫ్యామిలితో కలిసి వెళ్తుండగా..
బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలింది. నగవర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న కుటుంబ సభ్యులపై నిర్మాణంలో ఉన్న ఇనుప రాడ్డులతో ఉన్న..
బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలింది. నగవర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న కుటుంబ సభ్యులపై నిర్మాణంలో ఉన్న ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లి, మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తండ్రి, కుమార్తెలు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిద్దరిని ఆసుపత్రికి తరలించించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. లోహిత్ కుమార్, తేజశ్విని(28) హోరమావు ప్రాంతానికి చెందిన వారు. వారికి కవల పిల్లలు ఉన్నారు. లోహిత్.. రోజూ తన భార్య తేజశ్వినిని ఆఫీస్ వద్ద దింపి, పిల్లలను బేబీ సిట్టింగ్‌కు తీసుకెళ్లేవాడు.
ఈ క్రమంలో మంగళవారం కూడా అలానే వెళ్తుండగా.. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ వారిపై కూలింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా తల్లీ కుమారులు మృతిచెందారు. లోహిత్.. అతడి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, మెట్రో సిబ్బంది సహాయంతో కూలిపోయిన పిల్లర్‌ను, ఇనుప రాడ్లను క్లియర్ చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి