Telugu News India News The incident of police dragging an old woman has gone viral on social media Telugu news
Trending Video: ఖాకీ జులుం.. వృద్ధురాలు అని కూడా చూడకుండా.. జుట్టు పట్టుకుని లాక్కెళ్లి.. బలవంతంగా..
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కొన్ని సార్లు వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేశారన్న కారణంతో అమానుషానికి పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వృద్దురాలిని పోలీసులు లాక్కెళ్లి....
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కొన్ని సార్లు వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేశారన్న కారణంతో అమానుషానికి పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వృద్దురాలిని పోలీసులు లాక్కెళ్లి.. కారులో ఎక్కించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక వృద్ధ మహిళను పోలీసులు లాగి కారులో తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఒక నిమిషం 4 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో క్లిప్‌లో.. పోలీసు అధికారులు వృద్ధురాలిని ఈడ్చుకెళ్లి కారులో తీసుకెళ్లడాన్ని చూడవచ్చు. వృద్ధురాలికి ఎస్కార్ట్‌గా వెళ్లేందుకు మహిళా పోలీసు అధికారి కూడా లేకపోవడం గమనార్హం.
కాళ్లు పట్టుకున్నా ఆ వృద్ధురాలని వదలకుండా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి వారి వాహనం ఎక్కించారు. ఆ మహిళ కుమారుడు సాహిబ్ సింగ్‌పై తన సొంత సోదరే ఆర్థిక లావాదేవీల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాహిబ్ కోసం పోలీసులు ఇంటికి వచ్చారు. అయితే పోలీసుల నుంచి తన కుమారుడ్ని కాపాడుకోవడం కోసం ఆ వృద్ధురాలు అలా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొడతాయని మండిపడుతున్నారు.