E-Shram Portal: అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా ఎంతమంది అసంఘటిత కార్మికులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. గురువారం నాడు ఈ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనున్నారు.
అంతేకాదు.. ప్రతీ కార్మికుడికి ఆధార్ నెంబర్ మాదరిగా 12 నెంబర్ల యూనివర్స్ అకౌంట్ నెంబర్ ఇవ్వనున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 380 మిలియన్ అసంఘటిత రంగ కార్మికుల డేటాను రికార్డ్ చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. కార్మికులను ఆదుకునేందుకే ఈ పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
Also read:
Mysore Gang Rape: రెచ్చిపోయిన మానవ మృగాలు.. స్నేహితుడిని చితకబాది, విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Hyderabad: అనుమానస్పద స్థితిలో వివాహిత అదృశ్యం.. అసలు కారణమదేనా?