Delhi High Court ఆత్తారింట్లో ఉండేందుకు ఆమెకు అన్ని అర్హతలున్నాయి.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

|

Mar 23, 2022 | 9:55 AM

ఢిల్లీ హైకోర్టు (Delhi High court) కీలక తీర్పు వెల్లడించింది. పెళ్లయిన స్త్రీ (Married Woman) కి తన అత్తారింట్లో నివసించేందుకు గృహహింస చట్టం ప్రకారం అన్ని హక్కులు ఉంటాయని పేర్కొంది. హిందూ వివాహ చట్టం...

Delhi High Court ఆత్తారింట్లో ఉండేందుకు ఆమెకు అన్ని అర్హతలున్నాయి.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Delhi High Court
Follow us on

ఢిల్లీ హైకోర్టు (Delhi High court) కీలక తీర్పు వెల్లడించింది. పెళ్లయిన స్త్రీ (Married Woman) కి తన అత్తారింట్లో నివసించేందుకు గృహహింస చట్టం ప్రకారం అన్ని హక్కులు ఉంటాయని పేర్కొంది. హిందూ వివాహ చట్టం, గృహహింస చట్టం ద్వారా వచ్చే హక్కులు, అర్హతలో కొన్ని మార్పులు ఉంటాయని వెల్లడించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. కోడలికి తమ ఇంట్లో నివసించే హక్కు లేదని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ.. బాధిత మహిళ అత్తామామలు అడిషనల్ సెషన్ కోర్టును ఆశ్రయించారు. వివాహమైన మహిళకు అత్తవారింట్లో నివసించే హక్కు, అర్హత ఉంటాయని తీర్పు ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోడలికి తమ ఇంట్లో ఉండే హక్కు లేదని, ఆస్తిపై సైతం ఎలాంటి హక్కులు ఉండవని అత్తామామలు వాదించారు.

గతంలో కోడలు తమతో బాగానే ఉండేదని, ఆ తరువాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. అత్తవారింటికి తిరిగి వచ్చేందుకు కోడల్ని వారు అంగీకరించలేదని, దాంతో తనకు ఇంట్లో నివసించే అర్హత ఉందని కోరుతూ కోడలు కోర్టులో పిటిషన్ వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ చంద్రధారి సింగ్ వీరి పిటిషన్‌ను కొట్టివేశారు. అడిషనల్ సెషన్ కోర్టు తీర్పును సమర్ధిస్తూ.. కోడలికి అత్తవారింట్లో నివసించేందుకు అర్హత, హక్కు రెండూ ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read

Viral Wedding video: అతడికి 24, ఆమెకు 61ఏళ్లు.. పెళ్లైంది.. ఇక అందుకోసమే వెయిటింగ్..! ట్రెండ్ అవుతున్న వీడియో..

Fruit Ice Cream: మీరు ఐస్‌క్రీమ్ ప్రియులా.. ఇంట్లోనే టేస్టీగా ఈజీగా మిక్స్డ్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్ తయారు చేసుకోండి ఇలా

Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల బైక్ జర్నీ.. 27 దేశాలను అనుసంధానిస్తూ ప్రయాణం.. ఎందుకో తెలుసా..