రైతుల కుటుంబాలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా 6000 రూపాయలు అందిస్తుంది. పంట పెట్టుబడికి, ఎరువులు కొనగోలుకు, వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక సాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. పీఎం-కిసాన్ పథకం కింద, భూమి కలిగి ఉన్న ప్రతి రైతుల కుటుంబాలకు ప్రతి ఏడాది నాలుగు నెలలకు ఒక సారి రూ.2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో రూ.6000 ఆర్థిక సాయం చేయనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. లబ్ధిదారులు వారి బ్యాంక్ ఖాతా వివరాలకు ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించింది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN)కి సంబంధించిన 15వ విడత డబ్బులను అతి త్వరలో రైతుల ఖాతాలో జమ చేయనుంది. దీపావళి తర్వాత అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోం. దీనికి ముందు, ఈ ఏడాది జూలైలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌కి సంబంధించిన 14 వ విడత నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందేందుకు మీ పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాతో.. ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మీ ఆధార్‌తో బ్యాంక్ వివరాలను లింక్ చేయడానికి eKYC చేయాల్సి ఉంటుంది. దీనిని అప్డేట్ చేస్తేనే తదుపరి వాయిదా మొత్తం రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు ప్రకటించాయి.
“ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 15వ విడత డబ్బుల కోసం లబ్ధిదారులు eKYC చేయించాలని తెలిపింది. ఇలా చేయకపోతే.. పథకం లబ్థి లబ్ధిదారులు జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది. వెంటనే eKYCని చేయించడం ద్వారా లబ్థిని పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు. eKYC చేసుకోవడం కోసం PM-KISAN పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ లింక్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులో మీ ఆధార్ కార్డ్ 12 నంబర్లను నమోదు చేస్తే ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఆ పోర్టల్లో ఎంటర్ చేస్తే మీ ఆధార్ విజయవంతంగా లింక్ అవుతుంది.
ఇలా చేయలేని పక్షంలో గూగుల్ ప్లే స్టోర్‌లో (Google Play Store) నుండి PMKISAN GOI యాప్‌ను డౌన్‌లోడ్ చేసి కూడా మీ eKYC ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. లేకుంటే దగ్గర్లోని ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కూడా ఆధార్ ను అకౌంట్‌తో లింక్ చేయవచ్చు. రైతు ఖాతాకు సంబంధించిన డెబిట్ కార్డును ఏటీఎంలో స్వైప్ చేసి పిన్ నంబర్ నమోదు చేయాలి. సర్వీసెస్ అనే ఆఫ్షన్ ఎంపిక చేసుకొని రిజిస్ట్రేషన్‌ను సెలెక్ట్ చేయాలి. ఆ తరువాత మీది సేవింగ్స్ అకౌంటా.. కరెంట్ అకౌంటా.. అని అడుగుతుంది. దానికి సంబంధించిన వివరాలతో ముందుకు వెళ్లాలి. ఆ తరువాత ఆధార్ నంబర్‌ను పొందుపరిస్తే.. ఆధార్‌కి సంబంధించిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇలా చేసిన వెంటనే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయబడినట్లు ఒక మెసేజ్ వస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..