Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం వెళితే.. రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు.. ఆ తర్వాత ఏమైందంటే..?

|

Sep 29, 2021 | 8:55 AM

Nurse Mistake: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ నర్సు పొరపాటున కోవిడ్‌ వ్యాక్సిన్‌కు బదులుగా రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చింది. దీంతో బాధిత

Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం వెళితే.. రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Covid 19 Vaccine
Follow us on

Nurse Mistake: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ నర్సు పొరపాటున కోవిడ్‌ వ్యాక్సిన్‌కు బదులుగా రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చింది. దీంతో బాధిత వ్యక్తి భయాందోళన చెందాడు. చివరకు అధికారులు జోక్యం చేసుకుని నర్సుతోపాటు డాక్టర్‌పై కూడా వేటు వేశారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్వా హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో వెలుగుచూసింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు రాజ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అనూర్చ్‌ ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. అయితే.. కోవిడ్ టీకా కోసం వచ్చిన యాదవ్ కు నర్సు కీర్తి పోపెరె పొరపాటున రాబీస్ వ్యాక్సిన్ ఇంజక్షన్ ఇచ్చారు. పొరపాటును గ్రహించిన వైద్యులు రాబీస్ వ్యాక్సిన్ తీసుకున్న యాదవ్‌ను ఆరోగ్య కేంద్రంలో పరిశీలనలో ఉంచారు.

అయితే యాదవ్‌ కోవిడ్‌ టీకా లైనులో నిలబడే బదులు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే లైనులో నిలబడినట్లు నర్సు వెల్లడించింది. దీంతో నర్సు పేపర్‌ చూడకుండా పొరపాటున రేబిస్‌ టీకా ఇచ్చింది. కాగా.. టీకా వేసే ముందు అతని వద్ద ఉన్న పేపరు చూడకుండా కరోనా టీకాకు బదులుగా.. రాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడంపై మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నర్సు కీర్తిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆసుపత్రి డాక్టర్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ అధికారులు హెచ్చరించారు.

Also Read:

Ganja Nursery: విల్లాలో గంజాయి సాగు.. ఎంబీఏ కోసం భారత్‌కు వచ్చి రూ.కోట్లల్లో వ్యాపారం.. చివరకు..

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ రిలీఫ్.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో..