TS Governor -MP KK: పార్లమెంట్‌ ఆవరణలో అనుకోని ఘటన.. హోంమంత్రి చాంబర్‌ దగ్గర కలిసిన గవర్నర్‌, తెలంగాణ ఎంపీ..

|

Apr 06, 2022 | 8:41 PM

పార్లమెంట్‌లో అనుకోని సంఘటన జరిగింది. గవర్నర్‌కు(Telangana Governor), గవర్నమెంట్‌కు గ్యాప్‌ మరింత పెరిగిన నేపథ్యంలో తమిళిసై(Tamilisai ), కేకే(MP KK) అనుకోకుండా కలిశారు. హోంమంత్రిని..

TS Governor -MP KK: పార్లమెంట్‌ ఆవరణలో అనుకోని ఘటన.. హోంమంత్రి చాంబర్‌ దగ్గర కలిసిన గవర్నర్‌, తెలంగాణ ఎంపీ..
Telangana Governor And Tami
Follow us on

పార్లమెంట్‌లో అనుకోని సంఘటన జరిగింది. గవర్నర్‌కు(Telangana Governor), గవర్నమెంట్‌కు గ్యాప్‌ మరింత పెరిగిన నేపథ్యంలో తమిళిసై(Tamilisai ), కేకే(MP KK) అనుకోకుండా కలిశారు. హోంమంత్రిని కలిసేందుకు గవర్నర్‌ తమిళిసై ఆయన చాంబర్‌ వైపు వెళ్లారు. అదే సమయంలో మిగిలిన ఎంపీలతో కలిసి కేకే అటు వైపు వచ్చారు. అంతా కలిసి మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత అంతా కలిసి ఫొటోలు దిగారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలోనే కేకే అనుకోకుండా ఆమెను కలవడం చర్చనీయాంశమైంది.

అంతకుముందు.. ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనను అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని సూచించారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపుతున్నారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఢిల్లీ టూర్‌ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. గవర్నర్‌, గవర్నమెంట్ మధ్య ఉన్న గ్యాప్‌ను మరింత పెంచినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్.. వ్యక్తిగతంగా తనను అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని సూచించారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపుతున్నారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక వాస్తవానికి నరసింహన్‌ తర్వాత.. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై వచ్చిన కొత్తలో ప్రగతి భవన్‌, రాజ్‌భవన్‌ మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేది. అయితే ఆ తర్వాత కొద్దిరోజుల తర్వాత గవర్నర్, గవర్నమెంట్‌ మధ్య గ్యాప్ పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ సమావేశాలు దీనికి ఆజ్యం పోశాయి. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సెషన్‌ నిర్వహించింది ప్రభుత్వం. దానికి ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. గత సమావేశాలు ప్రొరోగ్‌ కానందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని చెప్పింది. దీనిపై కమలనాథులు అసహనం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్‌ గౌస్‌ అరెస్ట్‌.. మంత్రి కేటీఆర్‌ సూచనతో స్పందించిన పోలీసులు

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన..

Optical Illusion: ఈ ఫోటోలో ఏముందో గుర్తించండి.. మొదటగా కనిపించేదే మీ బలం..