చితకబాదినా బెదరని పిట్‌బుల్‌..దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

కుక్కల దాడులు తరచూ మనం వింటూనే ఉంటాం. ఐతే ఎవరైనా దాన్ని బెదిరిస్తేనో..కర్ర చూపిస్తేనో అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కానీ పంజాబ్‌ జలంధర్‌లో దారుణం జరిగింది. బెదిరించడం కాదు..కర్రలతో చితకబాదినా కదల్లేదు. ఓ బాలుడి పిక్కను పట్టుకున్న శునకం స్థానికులు ఎంత కొట్టినా వదిలిపెట్టలేదు. 15 ఏళ్ల లక్ష్‌ ఉప్పల్‌ అనే బాలుడు స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా..పిట్‌బుల్‌ జాతికి చెందిన ఓ కుక్క తన ప్రతాపం చూపించింది. ఒక్కసారిగా అతనిపై దాడి చేసి అతని కాలిని […]

చితకబాదినా బెదరని పిట్‌బుల్‌..దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
Follow us

|

Updated on: Jan 30, 2020 | 8:48 AM

కుక్కల దాడులు తరచూ మనం వింటూనే ఉంటాం. ఐతే ఎవరైనా దాన్ని బెదిరిస్తేనో..కర్ర చూపిస్తేనో అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కానీ పంజాబ్‌ జలంధర్‌లో దారుణం జరిగింది. బెదిరించడం కాదు..కర్రలతో చితకబాదినా కదల్లేదు. ఓ బాలుడి పిక్కను పట్టుకున్న శునకం స్థానికులు ఎంత కొట్టినా వదిలిపెట్టలేదు.

15 ఏళ్ల లక్ష్‌ ఉప్పల్‌ అనే బాలుడు స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా..పిట్‌బుల్‌ జాతికి చెందిన ఓ కుక్క తన ప్రతాపం చూపించింది. ఒక్కసారిగా అతనిపై దాడి చేసి అతని కాలిని పట్టేసుకుంది. బాలుడు బాధతో అరుపులు వేయడంతో కుక్కను చుట్టుముట్టిన స్థానికులు కర్రలతో చితకబాదారు. అయినా ఏ మాత్రం బెదరని ఆ శునకం..బాలుడి కాలిని మాత్రం వదిలిపెట్టలేదు. చివరికి 15 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.