మసీదుల్లోకి మహిళలకూ ప్రవేశం ఉంది.. అయితే…!
పురుషుల్లాగే.. మసీదుల్లోకి వచ్చి మహిళలు కూడా ప్రార్థనలు చేసుకోవచ్చని.. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. మసీదుల్లోకి మహిళలను కూడా అనుమతించేలా ఆదేశించాలంటూ.. యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే కోర్టుమెట్లెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఏఐఎంపీఎల్‌బీ ఈ అఫిడవిట్ అందించింది. అయితే ఈ సున్నిత అంశాన్ని.. శబరిమలలోకి మహిళల ప్రవేశంతో పాటుగా మతపరంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి దాఖలైన […]
పురుషుల్లాగే.. మసీదుల్లోకి వచ్చి మహిళలు కూడా ప్రార్థనలు చేసుకోవచ్చని.. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. మసీదుల్లోకి మహిళలను కూడా అనుమతించేలా ఆదేశించాలంటూ.. యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే కోర్టుమెట్లెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఏఐఎంపీఎల్‌బీ ఈ అఫిడవిట్ అందించింది. అయితే ఈ సున్నిత అంశాన్ని.. శబరిమలలోకి మహిళల ప్రవేశంతో పాటుగా మతపరంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై.. ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది.
కాగా, మతపరమైన సిద్ధాంతాలు, విశ్వాసాలకు అనుగుణంగా మసీదుల్లోకి ప్రవేశించే అనుమతి మహిళలకు ఉందని.. అయితే అలా ప్రవేశించడం అనేది పూర్తిగా వారి ఇష్టమని పేర్కొంది. దీనికి సంబంధించి విరుద్ధమైన మతపర అభిప్రాయాలపై తాము స్పందించదలచుకోలేదని.. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ముస్లిం మహిళలు తప్పనిసరిగా సామూహిక నమాజ్‌లో పాల్గొనాలని కానీ.. శుక్రవారం జరిగే ప్రార్థనల్లో పాల్గొనాలంటూ ఎలాంటి నిబంధనలు కూడా ఇస్లాంలో లేవని కోర్టుకు తెలిపారు.