Income Tax Raid: ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తలుపులు తెరవగా..! లోపలి దృశ్యం చూసి..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు చేసింది. ఈ క్రమంలో లెక్కల్లో చూపని కోట్లాది సంపద బయటపడింది. ముగ్గురు చెప్పుల వ్యాపారుల వద్ద ఇప్పటివరకు రూ.40 కోట్ల వరకు నగదు దొరికినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన నగదు లెక్కింపు జరుగుతోంది. గుట్టలు గుట్టలుగా పేర్చిఉన్న రూ.500 నోట్ల కట్టలను లెక్కించే బాధ్యతను బ్యాంకు ఉద్యోగులకు..

Income Tax Raid: ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తలుపులు తెరవగా..! లోపలి దృశ్యం చూసి..
IT Raids On Agra Shoe Traders

Updated on: May 19, 2024 | 12:26 PM

ఆగ్రా, మే 19: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు చేసింది. ఈ క్రమంలో లెక్కల్లో చూపని కోట్లాది సంపద బయటపడింది. ముగ్గురు చెప్పుల వ్యాపారుల వద్ద ఇప్పటివరకు రూ.40 కోట్ల వరకు నగదు దొరికినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన నగదు లెక్కింపు జరుగుతోంది. గుట్టలు గుట్టలుగా పేర్చిఉన్న రూ.500 నోట్ల కట్టలను లెక్కించే బాధ్యతను బ్యాంకు ఉద్యోగులకు అధికారులు అప్పగించారు.

ఓ గది మొత్తం 500-500 నోట్ల కట్టలతో నిండిపోయింది. ఇప్పటి వరకు రూ.40 కోట్ల వరకు లెక్కతేల్చగా.. మిగిలిన నగదును లెక్కించే పనిలో పడ్డారు. పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. షూ వ్యాపారులు ఆదాయపన్ను ఎగవేస్తున్నారనే ఫిర్యాదు అందడంతో ఆదాయపన్ను శనివారం మధ్యాహ్నం ముగ్గురి వ్యాపారుల రహస్య స్థావరానికి చేరుకుని దాడులు ప్రారంభించింది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను బృందం ఫైళ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరిశీలిస్తోంది. పన్ను ఎగవేత, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

కాగా ఇటీవల కాలంలో ఆదాయపు పన్ను శాఖ యూపీలోని పలు చోట్ల భారీ దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలోని కాన్పూర్‌తో పాటు, ముంబై, ఢిల్లీ, గుజరాత్‌లలో దాదాపు 20 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడులో భారీగా నగదు పట్టుబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.