Covid 19: చెన్నై ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో దారుణాతి దారుణం చోటు చేసుకుంది. కోవిడ్ పేషెంట్ వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌పై కన్ను వేసిన ఆస్పత్రి ఉద్యోగిణి.. పేషెంట్‌ను అత్యంత కిరాతకంగా చంపేసింది. అయితే, తన భార్య కనిపించడం లేదంటూ భర్త చేసిన ఫిర్యాదు అసలు విషయం అంతా బయటపడింది. మే 23వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైకి చెందిన సునితకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమె చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. సునీత భర్త మౌళి అమెకు అవసరమైనవి అందిస్తూ వచ్చాడు. అయితే, సునీత వద్ద కొంత నగదు, సెల్ ఫోన్ ఉన్నాయి. వాటిని కన్ను వేసింది ఆసుప్రతిలో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగిని రతీదేవి. ఎలాగైనా వాటిని కాజేయాలని ప్లాన్ వేసుకున్న రతీదేవి.. మే 23వ తేదీన రతీదేవి.. కోవిడ్ పేషెంట్ సునీతను అత్యంత దారుణంగా చంపేసింది. ఆమె వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ తీసుకుని.. సునీత మృతదేహాన్ని ఆస్పత్రి వెనుకవైపు పడేసింది.
అయితే, సునీత భర్త మౌళి తన భార్య ఆస్పత్రిలో కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి మొత్తం గాలించారు. అయినా ఎక్కడా కనిపిపంచలేదు. చివరకు ఇవాళ ఆస్పత్రి వెనుకవైపు సునీత మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. క్లూస్ ఆధారంగా విచారణ చేపట్టి హత్య చేసింది రతీదేవి అని తేల్చారు. రతీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెల్లడించింది. సునీత వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ కాజేసేందుకే హత్య చేసినట్లు రతీదేవి అంగీకరించింది. రతీదేవిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఇవాళ హాజరుపరుచనున్నారు.
Also read:
TPCC Chief Election: ఎటు తేలని తెలంగాణ పీసీసీ చీఫ్.. కొత్త అలజడి సృష్టిస్తున్న సోనియా గాంధీకి లేఖ