India Corona Updates: దేశంలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. మరణాలు.. తాజాగా ఎన్ని కేసులంటే..!
India Corona Updates: దేశంలో ఒక వైపు కోవిడ్ వ్యాక్సినేషన్, మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతోంది. గడిచిన 24 గంటల్లో
India Corona Updates: దేశంలో ఒక వైపు కోవిడ్ వ్యాక్సినేషన్, మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతోంది. గడిచిన 24 గంటల్లో 67,208 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,330 మంది మరణించారు. తాజాగా 1,03,570 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 2,97,00,313 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 2,84,91,670 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 3,81,903 మంది కోవిడ్ తో మృతి చెందారు. ఇక దేశంలో క్రియాశీల రేటు 2.78శాతం ఉండగా, రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది. అయితే దేశంలో కరోనా అదుపులోకి వస్తుంది. నెల రోజులకుపైగా కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీలే అధికంగా నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజు 34,63,961 మందికి కోవిడ్ టీకాలు వేయగా, ఇప్పటి వరకు దేశంలో మొత్తం వేసిన టీకాల సంఖ్య 26,55,19,251కి చేరింది.
కాగా, కరోనా కట్టడికి కేంద్రంతో రాష్ట్రాలు కూడా కఠిన చర్యలు తీసుకున్నాయి. లాక్‌డౌన్ విధిస్తూ పాజిటివ్ కేసులు తగ్గేలా చర్యలు చేపట్టాయి. కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ 15వేలకు మంచి కేసులు నమోదు కావడం లేదు. అత్యధికంగా కేరళ నుంచే వస్తున్నాయి. కేరళలో 13,270, తమిళనాడులో 10,448, మహారాష్ట్రలో 10,107 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్, లాక్‌డౌన్ ఆంక్షల వల్ల దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.
ఇవీ కూడా చదవండి
Viral Video: ఓ మహిళ బైక్ నడుపుతున్న వీడియోను చూస్తే ఆశ్యర్యపోతారు.. సోషల్ మీడియాలో వైరల్