Shocking: పాస్టర్ ముసుగులో పాపాలు.. ల్యాప్‌టాప్ నిండా ఆ బొమ్మలే..!

|

Mar 22, 2023 | 9:09 PM

పాస్టర్ ముసుగులో పాపాలు. తమిళనాడులో బెనెడిక్ట్ యాంటో లీలలు అన్నీ ఇన్నీ కాదు. పైకి దైవ వాక్యాలు వల్లెవేస్తూ.. అంతర్గతంగా మాత్రం వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిలకు మత భోదనల పేరుతో దగ్గరై ట్రాప్ చేశాడు.

Shocking: పాస్టర్ ముసుగులో పాపాలు.. ల్యాప్‌టాప్ నిండా ఆ బొమ్మలే..!
Father Benedict Anto
Follow us on

పాస్టర్ ముసుగులో పాపాలు. తమిళనాడులో బెనెడిక్ట్ యాంటో లీలలు అన్నీ ఇన్నీ కాదు. పైకి దైవ వాక్యాలు వల్లెవేస్తూ.. అంతర్గతంగా మాత్రం వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిలకు మత భోదనల పేరుతో దగ్గరై ట్రాప్ చేశాడు. వారితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడ్డాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడీ ఘటన సంచలనంగా మారింది.

పర్సనల్‌ బొమ్మలు సోషల్‌ మీడియాలోకి ఎలా వచ్చాయి? ఈ పాయింట్‌ వెనుక షాకింగ్ స్టోరీ ఉంది. యాంటో నిర్వాకం ఎప్పుడో లోకల్‌గా లీకయింది. ఆ క్రమంలోనే యాంటోపై అటాక్‌ జరిగింది. దాడి చేసిన దుండగులు అతని ల్యాప్‌ టాప్‌ లాక్కెళ్లారు. ఇంకేం వుంది.. క్లిక్‌ చేస్తే.. బుల్లిపెట్టెనిండా బూతు బొమ్మలే.. వీడు మాములోడు కాదురా బుజ్జీ అనుకున్న సదరు శాల్తీలు.. యాంటో బ్లూస్‌ను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం, అవి వైరల్‌గా మారడం చకచకా జరిగింది.

యువతుల అసభ్యకర ఫొటోలు తీసి.. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు బెనెడిక్ట్ యాంటో. వారిని లైంగికంగా వేధిస్తూ వీడియోలు తీస్తూ.. మరింతగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. పాస్టర్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. 18 ఏళ్ల యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులకు భయపడిన పాస్టర్.. పారిపోయి ఓ ఫామ్‌హౌస్‌లో దాక్కున్నాడు. అయినా అతన్ని వదలని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

29 ఏళ్ల బెనెడిక్ట్.. కన్యాకుమారి జిల్లాలోని విలవన్కోడ్‌ వాసి. జిల్లాలోని కొన్ని చర్చిల్లో పాస్టర్‌గా పనిచేశాడు. కొన్ని రోజుల కిందట పెళ్లైన ఓ యువతిని లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యాంటో గుట్టు రట్టైంది. పోలీసులు పాస్టర్‌ యాంటోను అరెస్టు చేశారు.

మరోవైపు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫాస్టర్‌ ముసుగులో యాంటో ఆగడాలపై వైడ్‌ యాంగిల్‌లో దర్యాప్తు చేపట్టారు కన్యాకుమారి పోలీసులు. విచారణలో ఇంకెన్ని బ్లూ ట్రూత్స్‌ వెలుగులోకి రానున్నాయో అనే చర్చ జోరందుకుంది. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ ఇలాంటోన్ని ఉపేక్షించకూడదు. భక్తి ముసుగులో యువతుల జీవితాలతో చెలగాటమాడిన యాంటోను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ ఊపందుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..