Tamil Nadu: కాలేజీ చైర్మన్ కీచక పర్వం.. ఆ వీడియోలు వైరల్ అవడంతో బయటపడ్డ బాగోతం..

|

Jun 12, 2022 | 5:30 AM

Tamil Nadu: తమిళనాడులో ఓ ప్రైవేట్ కాలేజీ చైర్మన్ కీచక పర్వం బయటపడింది. అధికారం అడ్డం పెట్టుకుని.. విద్యార్థినుల జీవితాలతో..

Tamil Nadu: కాలేజీ చైర్మన్ కీచక పర్వం.. ఆ వీడియోలు వైరల్ అవడంతో బయటపడ్డ బాగోతం..
Video Call
Follow us on

Tamil Nadu: తమిళనాడులో ఓ ప్రైవేట్ కాలేజీ చైర్మన్ కీచక పర్వం బయటపడింది. అధికారం అడ్డం పెట్టుకుని.. విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడాడు ఆ నీచుడు. తనతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడాలంటూ తన కాలేజీలో చదువుతున్న విద్యార్థినులను బెదిరించాడు. అయితే, కాలేజీ చైర్మన్, విద్యార్థినిలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయనగారి బాగోతం బట్టబయలైంది. కాగా, కాలేజీ చైర్మన్ నిర్వాకంపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ ముందు ధర్నాకు దిగారు. కీచక చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వివరాల్లోకెళితే.. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకొట్టైలో ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ ఉంది. ఆ కాలేజీలో 500 మందికి పైగా విద్యార్థినిలు నర్సింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో కాలేజీ చైర్మన్ జూన్ క్రేస్.. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని విద్యార్థినులను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. కొంతమంది యువతులను ట్రాప్ చేసి వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు. మరికొందరు విద్యార్థినులను కూడా తనతో న్యూడ్ కాల్స్ మాట్లాడాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో జూన్ క్రేస్, విద్యార్థినులకు సంబంధించిన వీడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో కాలేజీ విద్యార్థినులు ఆందోళనలు చేపట్టారు. చైర్మన్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కాలేజీ చైర్మన్ జూన్ క్రేస్‌ ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..