JK హౌస్, గౌతమ్ సింఘానియా భారతదేశంలోని రెండవ అత్యంత విలువైన నివాసాలలో ఇదొకటి. ఇది రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సంఘానియాకు చెందినది. ఈ 30 అంతస్తుల సదుపాయంలో రెసిడెన్షియల్ యూనిట్, ఆఫీస్ స్పేస్, ఐదు అంతస్తుల రిజర్వు పార్కింగ్, స్పా, రెండు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, జిమ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా. అలాగే 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెలిప్యాడ్ ఉంది. దీని విలువ రూ.6,000 కోట్లు ఉంటుందని అంచనా.