
Tamil Nadu Politics: జయలలిత నెచ్చెలి శశికళ తమిళనాట అడుగైనా పెట్టకుండానే.. పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. అలా ఆమె జైలు నుంచి విడుదల అయ్యారో లేదో.. తమిళనాట పరిస్థితి చిన్నమ్మ వర్సెస్ అన్నాడీఎంకే అన్నట్లుగా మారిపోయింది. ఇప్పటికే శశికలకు మద్దతుగా నిలవాలంటూ తమిళనాట పలు ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు తీవ్ర కలకం రేపిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జయలలిత స్మారక మందిరాన్ని ప్రభుత్వం మూసివేసింది. అమ్మ మ్యూజియం పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం బోర్డు పెట్టింది. శశికళ రాక నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీన శశికళ చెన్నైకి రానున్నారు. ఆ సందర్భంగా ఆమె నేరుగా జయలలిత సమాధి వద్దకే రావాలని శశికళ నిర్ణయించుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం జయలలిత స్మారక మందిరాన్ని మూసివేశారని శశికళ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సష్టించినా శశికళ రాకను అడ్డుకోలేరని వారు అంటున్నారు.
Also read:
ఆ నాలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. కొత్తగా ఇన్‌చార్జిలను నియమించిన అధిష్టానం
స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన మెగాపవర్‌స్టార్.. పోలీసుల కథలంటే ఇష్టమన్న రాంచరణ్