Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవిత్ర తిరువణ్ణామలైలో కామ పిశాచి.. విదేశీ మహిళపై అఘాయిత్యం..!

తమిళనాడులోని తిరువణ్ణామలై ఒక ప్రసిద్ధ ప్రదేశం. ధ్యానం, ఆత్మశాంతి కోసం పెద్ద సంఖ్యలో దేశవిదేశీయులు ఇక్కడికి వస్తారు. జనవరి నెలలో 46 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ కూడా ఇక్కడికి ధ్యానం కోసం వచ్చింది. ఒక ఆశ్రమంలో ఉంటూ దీపమలై కొండ వద్ద ధ్యానం చేయాలనుకుంది. ఇందుకోసం వెంకటేశన్ అనే ఒక టూరిస్ట్ గైడ్‌ను నియమించుకుంది. అతడే ఆమె పాలిట శాపంగా మారాడు.

పవిత్ర తిరువణ్ణామలైలో కామ పిశాచి.. విదేశీ మహిళపై అఘాయిత్యం..!
Accused Tourist Guide Arrested
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 19, 2025 | 4:38 PM

మదంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని వారి బతుకులను చిదిమేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఒక పర్యాటకురాలిని కొండపైకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశాడు టూరిస్ట్ గైడ్. ఫ్రెంచ్ దేశానికి చెందిన యువతిని టూరిస్ట్ గైడ్‌ 2,668 అడుగుల ఎత్తైన దీపమలై కొండ వద్ద ధ్యానం చేయడానికి తీసువెళ్ళాడు. అక్కడ గైడ్ ఆ మహిళను ఏకాంత గుహలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, తిరువణ్ణామలై ఒక ప్రసిద్ధ ప్రదేశం. ధ్యానం, ఆత్మశాంతి కోసం పెద్ద సంఖ్యలో దేశవిదేశీయులు ఇక్కడికి వస్తారు. జనవరి నెలలో 46 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ కూడా ఇక్కడికి ధ్యానం కోసం వచ్చింది. ఒక ఆశ్రమంలో ఉంటూ దీపమలై కొండ వద్ద ధ్యానం చేయాలనుకుంది. ఇందుకోసం వెంకటేశన్ అనే ఒక టూరిస్ట్ గైడ్‌ను నియమించుకుంది. అతడే ఆమె పాలిట శాపంగా మారాడు.

ఈ సమయంలో, ఫ్రెంచ్ యువతి టూరిస్ట్ గైడ్‌తో కలిసి దీపమలై కొండను అధిరోహించింది. అయితే గత సంవత్సరం కొండచరియలు విరిగిపడిన తర్వాత అధికారులు సాధారణ ప్రజలు ఈ కొండ ఎక్కడాన్ని నిషేధించింది. ఇదే అదునుగా భావించిన టూరిస్ట్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ధ్యానం చేసుకోవడానికి కొండపై ఉన్న గుహలోకి వెళ్ళినప్పుడు, స్థానిక గైడ్ అయిన వెంకటేశన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

టూరిస్ట్ గైడ్ బారి నుండి ఎలాగో తప్పించుకుని, ఆ మహిళ కొండ దిగి వెంటనే తిరువన్నమలై వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఆ సంఘటను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వెంటనే చర్యలు తీసుకుని నిందితుడు వెంకటేశన్‌ను అరెస్టు చేశారు. పోలీసులు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..