AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Madhav: ఇండస్ట్రీలో ఆ ముగ్గురు హీరోయిన్స్ నాకు స్నేహితులు.. కానీ అంత క్లోజ్ కాదు

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నటుడు వేణు మాధవ్, ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించిన వేణుమాధవ్ మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు వేణుమాధవ్ .

Venu Madhav: ఇండస్ట్రీలో ఆ ముగ్గురు హీరోయిన్స్ నాకు స్నేహితులు.. కానీ అంత క్లోజ్ కాదు
Venumadhav
Rajeev Rayala
|

Updated on: Aug 03, 2026 | 9:15 PM

Share

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ చనిపోయి ఇంతకాలం అవుతున్న ఆయనను ప్రేక్షకులు నిత్యం గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వేణుమాధవ్  ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, రాజకీయ అనుబంధాలకు సంబంధించిన అనేక వివరాలను పంచుకున్నారు. సాంప్రదాయం సినిమాతో కెరీర్ ప్రారంభించి, పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి, హంగుమా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి సినిమాల్లో హీరోగా కూడా మెప్పించిన వేణు మాధవ్, తన ఆస్తులు, పుకార్లు, సినీ పరిశ్రమలో తన స్థానం గురించి నిర్మొహమాటంగా మాట్లాడారు. తనకు ఒక పెద్ద ఇల్లుతో పాటు పది చిన్న అద్దె ఇళ్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఇళ్లన్నిటికీ “అచ్చి వచ్చిన కృష్ణ నిలయం” అనే పేరు పెట్టానని, తన తల్లిదండ్రుల పేర్లతో పాటు ఈ పేరును ఇంటింటికీ పెట్టడం వెనుక ఉన్న ఆసక్తికర నేపథ్యాన్ని తెలియజేశారు. తన తల్లిదండ్రులు లేకుంటే తాను లేనని, ఇది వారు పెట్టిన భిక్ష అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రెంట్ల మీద జీవించగలనని, అయితే హౌసింగ్ లోన్లు ఉన్నాయని తెలిపారు.

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

సినీ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితులు ఎవరూ లేరని, స్నేహ, త్రిష, శ్రియా వంటి హీరోయిన్లతో పాటు చిరంజీవి వంటి స్టార్స్‌తో తనకు మంచి స్నేహం ఉందని, కానీ అది వ్యక్తిగత సమస్యలను పంచుకునేంత సన్నిహితం కాదని చెప్పారు. తన కెరీర్‌లో వచ్చిన విరామం గురించి వేణు మాధవ్ మాట్లాడుతూ, బూతులున్న సినిమాలు చేయనని తాను ఒక నిర్ణయం తీసుకోవడం వల్లే కొంత గ్యాప్ వచ్చిందని పేర్కొన్నారు. “ఎవరూ ఎవరినీ తొక్కరు, వాడిని వాడే తొక్కోవడమే తప్ప” అని సినీ పరిశ్రమ స్వభావాన్ని వివరించారు. టాలెంట్ ఉంటే ఎవరూ ఎవరినీ తొక్కలేరని, బ్యాడ్ బిహేవియర్ లేదా సరైన సమయం పాటించకపోవడం వంటి కారణాల వల్లనే ఎవరికి వారే తమను తాము తొక్కేసుకుంటారని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

తాను ప్రస్తుతం సంపాదించకపోయినా, తన వద్ద ఉన్న సంపాదన అద్భుతంగా ఉందని, 10 ఎకరాల పొలం ఉన్నందున తనకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని తెలిపారు. మానసిక సమస్యలు కూడా ఎవరితోనైనా మాట్లాడితే క్లియర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు తన వల్ల విజయవంతం కాలేదని వేణు మాధవ్ తెలిపారు. సినిమాలు విజయవంతం కావడానికి రైటర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలే కారణమని, తన పాత్రల కోసం రైటర్లు తనను ఎంచుకోవడం వల్లనే ఆ సినిమాలు నడిచాయని అన్నారు. 500కు పైగా సినిమాలు చేసినా, తన వల్ల ఒక్క సినిమా కూడా నడవలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us