Jayalalitha Death Mystery: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలిత మృతిపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ డెత్ మిస్టరీపై సంచలన కామెంట్స్ చేశారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. జయలలిత మృతి మిస్టరీని తేల్చేందుకు నియమించిన విచారణ కమిటీ.. తాజాగా ఓపీఎస్‌ను విచారించింది. ఈ విచారణలో ఓపీఎస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో సీసీ కెమెరాలను తొలగించాలని తాను చెప్పలేదన్నారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించానని తెలిపారు. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ కుమార్, సీఎస్ రామ్ మోహన్ రావు లతో చర్చించానని, వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించారాయన. ఆ తరువాత శశికళ చొరవతోనే విదేశీ వైద్యులు వచ్చారని, జయలలితకు వారు ట్రీట్‌మెంట్ ఇచ్చారని విచారణ కమిషన్‌కు విచారించారు ఓపీఎస్.
2016, డిసెంబర్ 5వ తేదీన జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళులు అమ్మగా పిలుచుకునే జయ మృతి వెనుక భారీ కుట్ర దాగి ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. 2018లో జయ మృతి మిస్టరీని తేల్చేందుకు రిటైర్డ్ జస్టిస్ ఆర్ముగం నేతృత్వంలో విచారణ కమీషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఆర్ముగం కమీషన్.. ఓపీఎస్‌కు కూడా విచారణ కోసం నోటీసులు జారీ చేసింది. అయితే, ఓపీఎస్ విచారణకు హాజరవలేదు. తాజాగా ఈ కమిషన్ ఓపీఎస్‌కు సమన్లు జారీ చేయడంతో.. విచారణకు హాజరయ్యారు ఒపిఎస్.
Also read:
Viral Video: బాబోయ్.. ఏంటది అలా ఉంది.. టీవీ చూసి షాకైన చిన్నారి.. వీడియో వైరల్..
Mukesh Ambani: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట.. మొదటి రోజు ఇలా..
CM KCR: దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతోంది.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..