తమిళనాడులో మరింత ముదిరిన ఉత్తరాది కూలీల వివాదం.. ఆగ్రహంలో సీఎం స్టాలిన్.. కీలక ఆదేశాలు జారీ..!

|

Mar 05, 2023 | 9:32 AM

తమిళనాడులో మరింత ముదురుతోంది ఉత్తరాది కూలీల వ్యవహారం. తమిళనాడు నుంచి వెళ్లిపోతున్నారు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు. దీంతో ఫేక్‌ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం స్టాలిన్‌..

తమిళనాడులో మరింత ముదిరిన ఉత్తరాది కూలీల వివాదం.. ఆగ్రహంలో సీఎం స్టాలిన్.. కీలక ఆదేశాలు జారీ..!
Cm Stalin
Follow us on

తమిళనాడులో మరింత ముదురుతోంది ఉత్తరాది కూలీల వ్యవహారం. తమిళనాడు నుంచి వెళ్లిపోతున్నారు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు. దీంతో ఫేక్‌ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం స్టాలిన్‌. తమిళనాడులో ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారికైనా పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

మరోవైపు ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు స్టాలిన్‌. ఉత్తరాది కూలీలపై తమిళులు దాడి చేసినట్టు విష ప్రచారం చేసే వారిపై..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఫేక్ వీడియోలు నమ్మి ఎవరూ భయపడొద్దని సూచించారు.

ఇక సీఎం స్టాలిన్ ఆదేశాలతో ఉత్తరాది కూలీలు ఎక్కువగా ఉండే కోయింబత్తుర్ , తిరుప్పూర్ జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన కూలీలతో సమావేమయ్యారు అధికారులు. కూలీల సమస్యలపై ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటుచేశారు. మరోవైపు ఉత్తరాది కూలీలపై దాడికి సంబంధించి నిజనిర్థారణకు తమిళనాడు వచ్చిన బీహార్‌ ప్రతినిధులు.. తమిళనాడు అధికారులతో సమావేశమయ్యారు. ఇవాళ కోయింబత్తూర్‌, తిరుప్పూర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..