Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ బాటలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి.. సంచలన ప్రకటన..!

|

Apr 22, 2022 | 6:49 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి పయనిస్తున్నారు. ఏపీలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాన్ని..

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ బాటలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి.. సంచలన ప్రకటన..!
Ap Cm Jagan
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి పయనిస్తున్నారు. ఏపీలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాన్ని తమ రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రం, ఏ పథకమో ఇప్పుడు చూద్దాం.. ఆంధ్రప్రదేశ్‌కు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్. 600 గ్రామ సచివాలయాలను ఈ ఏడాదే ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామ సచివాలయాలు సమావేశ మందిరంతో సహా అన్ని సౌకర్యాలను కలిగి ఉంటాయని, ఒక్కొక్కటి 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మితమవుతాయని చెప్పారు. నవంబర్ 1వ తేదీని స్థానిక పాలనా దినోత్సవంగా పాటిస్తామని చెప్పారు స్టాలిన్. ఏడాదికి గ్రామసభలు నిర్వహించే సమావేశాలను 4 నుంచి 6కు పెంచుతామని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తామని ప్రకటించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ బియ్యం వంటి కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడు గ్రామ సచివాలయ భవనాలు నిర్మించనున్నట్టు ప్రకటించింది.

Stalin

Also read:

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కలకలం.. పుల్వామా తరహా అటాక్‌కు స్కెచ్.. షాకింగ్ స్టోరీ..!

Realme GT 2: వార్షికోత్సవం వేళ రియల్‌‌మి బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి రియల్‌మి జీటీ 2..

Telangana Rain Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరో గంటలో నగర వ్యాప్తంగా..