పీక్స్‌కి చేరిన ద్రవిడుల ప్రాంతీయతత్వం.. వీళ్లదసలు స్వాభిమానమా లేక వితండవాదమా?

‘‘నమక్కు నామే..’’ తమిళనాడు ప్రభుత్వం అక్కడి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకం. నమక్కునామే అంటే మనకు మనమే అని అర్థం. ప్రభుత్వం, ప్రజలు పరస్పర సహకారంతో వాళ్ల ఊర్లను వాళ్లే బాగుచేసుకోవడం. మనకు మనమే అనే కాన్సెప్ట్ వాళ్లకు కొత్తేమీ కాదు. ద్రవిడ సమాజం గుండె లోతుల్లోనే ఉంది. ఎవరి చేతికిందో నీళ్లు తాగే ఖర్మలు మనకొద్దు.. ఎవ్వరి పెత్తనాలకో తలొగ్గే చేతకానితనాలు మనవి కావు.. అనే వాదం ఇప్పుడు జాతీయస్థాయిలో వినిపిస్తోంది తమిళనాడు ప్రభుత్వం.

పీక్స్‌కి చేరిన ద్రవిడుల ప్రాంతీయతత్వం.. వీళ్లదసలు స్వాభిమానమా లేక వితండవాదమా?
Tamil Autonomous

Updated on: Apr 17, 2025 | 10:05 PM

‘‘నమక్కు నామే..’’ తమిళనాడు ప్రభుత్వం అక్కడి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకం. నమక్కునామే అంటే మనకు మనమే అని అర్థం. ప్రభుత్వం, ప్రజలు పరస్పర సహకారంతో వాళ్ల ఊర్లను వాళ్లే బాగుచేసుకోవడం. మనకు మనమే అనే కాన్సెప్ట్ వాళ్లకు కొత్తేమీ కాదు. ద్రవిడ సమాజం గుండె లోతుల్లోనే ఉంది. ఎవరి చేతికిందో నీళ్లు తాగే ఖర్మలు మనకొద్దు.. ఎవ్వరి పెత్తనాలకో తలొగ్గే చేతకానితనాలు మనవి కావు.. అనే వాదం ఇప్పుడు జాతీయస్థాయిలో వినిపిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. తమకు కావల్సిందాన్ని, తమకు న్యాయబద్ధంగా దక్కాల్సినదాన్ని అడిగి తీసుకోవడం కాదు.. కొట్టి లాక్కోవడం తమిళనాడుకు బాగా అలవాటున్న సమాచారమే. తమ సంప్రదాయ సాహసక్రీడ జల్లికట్టును నిషేధిస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే పోరాడి తిరగరాయించుకున్న ఘటికులు వీళ్లు. మా భాష మీద, మా కల్చర్ మీద, మా ప్రాంతం మీద పెత్తనానికొస్తే పాతరేస్తాం.. అంటూ పిచ్చలెవల్లో ఫైటింగ్ స్పిరిట్ చూపే తమిళనాట.. హక్కుల కోసం జరిగే పోరాటం.. ఇప్పుడు క్లైమాక్స్‌కొచ్చేసింది. తమిళనాడుకు స్వయంప్రతిపత్తి కావాలన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్‌.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. తమిళనాట ఫైర్‌బ్రాండ్‌ గవర్నర్‌గా పేరు తెచ్చుకున్న ఆర్‌ఎన్ రవి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం.. బిల్లులను తొక్కిపెడితే కోర్టును ఆశ్రయించవచ్చని తీర్పు చెప్పడం.. వెంటనే గవర్నర్‌కు షాకిస్తూ అసెంబ్లీలో పది బిల్లులను నోటిఫై చేయడం.. ఇవన్నీ కలిపి తమిళనాడును మరోసారి నేషనల్ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లాయి. సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు కంటే.....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి