
తమిళనాడు సీఎం స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు హెల్త్ బుటెలిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనకు ఇంకొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అపోలో వైద్యులు తెలిపారు. అయితే ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో స్టాలిన్ ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించడంతో రెగ్యులర్ చెకప్‌లో భాగంగా వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ఆయన అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆయన మరో రెండ్రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..
ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ సోదరుడు, నటుడు ఎంకే ముత్తు శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల ముత్తు చెన్నయ్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమిళ సినీరంగంలో నటుడిగా, గాయకుడిగా ఇయన ఎంతగానే పేరు తెచ్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయన సినీ పరిశ్రమను వదిలేశాడు. ఆయన మరణంపై సీఎం స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తమకు తీవ్రంగా కలిచి వేసినట్టు వారు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.