AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Palaniswami: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పళనిస్వామి.. స్టాలిన్‌కు శుభాకాంక్షలు

Tamil Nadu Palaniswami: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత తమ పార్టీ అన్నాడీఎంకే ఓటమి

CM Palaniswami: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పళనిస్వామి.. స్టాలిన్‌కు శుభాకాంక్షలు
Palaniswami
Subhash Goud
|

Updated on: May 03, 2021 | 12:56 PM

Share

Tamil Nadu Palaniswami: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత తమ పార్టీ అన్నాడీఎంకే ఓటమి చెందడంతో డీఎంకే మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు పంపారు. మరోవైపు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం చెన్నైలో సమావేశం కానున్నారు. లెజిస్లేచర్‌ పార్టీ నేతగా ఎంకే స్టాలిన్‌ను ఎన్నుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను స్టాలిన్‌ కలువనున్నారు. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న ఎంకే స్టాలిన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పళనిస్వామి ట్వీట్‌.

Also Read: Mamata Banerjee Photo: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న 1980 నాటి మ‌మ‌తా బెన‌ర్జీ ఫొటో..