Rain Update: బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాలు..!

|

Jun 14, 2021 | 1:39 PM

Rain Update: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. రాగల 48 గంటల్లో రుతుపవనాలు మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు,..

Rain Update: బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాలు..!
Follow us on

Rain Update: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. రాగల 48 గంటల్లో రుతుపవనాలు మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని అధికారులు వెల్లడించారు.

ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. హైద‌రాబాద్ స‌హా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్‌, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో వ‌ర్షాలు ప‌డ్డాయి. హైద‌రాబాద్‌లోని కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.

ఇవీ కూడా చదవండి

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్‌.. టీకా తీసుకోండి.. కారు గెలుచుకోండి

New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు