కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్.. నోట్ల కట్టలు, కండోమ్ ప్యాకెట్లు, మందుసీసాలు!

కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కళాశాలలో ఏడాది కాలంగా మూసి ఉన్న విద్యార్థి సంఘం గదిని తెరిచిన అధికారులు షాకింగ్ విషయాలను గుర్తించారు. రూ.1 కోటి నగదు, రివాల్వర్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లతో పాటు విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు బయటపడటం సంచలనం రేపింది. ఈ ఘటనపై రాజకీయ ఆరోపణలు, విచారణ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్.. నోట్ల కట్టలు, కండోమ్ ప్యాకెట్లు, మందుసీసాలు!
Surendranath College Kolkat

Updated on: Jun 03, 2026 | 12:17 PM

కోల్‌కతాలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాలలో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. కాలేజీలో ఏడాది కాలంగా మూసి ఉన్న విద్యార్థి సంఘం గదిని తెరిచి చూడగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. గదిలో చెదలు పట్టిన రూ.1 కోటి నగదు ఉన్న రెండు పెద్ద పెట్టెలు లభించాయి. వాటితో పాటు మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ కూడా దొరికాయి.

2019 నుండి క్యాంపస్ ఎన్నికలు జరగనందున, కళాశాలల్లోని యూనియన్ రూమ్‌లను మూసివేయాలని కలకత్తా హైకోర్టు అప్పటి టీఎంసీ ప్రభుత్వాన్ని ఆదేశించడంతో, 2025లో ఆ గదికి తాళం వేశారు. గత ఏడాది జూన్‌లో సౌత్ కలకత్తా లా కాలేజీలోని యూనియన్ రూమ్‌లో 24 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం జరిగిన కొద్ది రోజులకే ఈ కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యార్థి సంఘం నిధుల నుండి చేసే అన్ని ఖర్చులను ఆడిట్ చేయాలని సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కళాశాలలను కోరిన తర్వాత సురేంద్రనాథ్ కళాశాలలోని ఆ గదిని తెరిచినట్లు సమాచారం. దాంతో ఈ రహస్యాలు బయటపడ్డాయి.

ఈ ఘటనతో కాలేజీ క్యాంపస్‌లో మరిన్ని సోదాలు నిర్వహించగా క్యాంపస్ లోపల ఏసీలు, అటాచ్డ్ బాత్రూమ్‌లు, పడకలు, ఖరీదైన పరుపులు, దిండ్లు అమర్చిన రెండు పడకగదులు బయటపడ్డాయి. ‘కంకట దేబు’గా ప్రసిద్ధి చెందిన టీఎంసీ బలమైన నాయకుడు దేబాశిస్ బంద్యోపాధ్యాయ్, అతని కుమారుడు శిబాశిస్ ఆ గదులను ఉపయోగించుకున్నారని కళాశాల అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా ఈ గదులలో ఆ ఇద్దరు నాయకులకు ఉద్యోగులతో మసాజ్‌లు చేయించేవారని వారు పేర్కొన్నారు. అయితే దేబాశిస్ బంద్యోపాధ్యాయ్ తనకు బెడ్ రూమ్‌ల గురించి తెలియదని ఆ ఆరోపణలను ఖండించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us