అత్యాచార బాధితురాలికి కోర్టులో జడ్జి ముందే ప్రపోజ్‌ చేసిన నిందితుడు! శిక్ష రద్దు చేస్తూ కోర్టు తీర్పు..

అత్యాచారం కేసులో నిందితుడికి విధించిన శిక్షను సస్పెండ్ చేసింది సుప్రీం కోర్టు. నిందుతుడు, బాధితురాలు వివాహం చేసుకోవాలని కోరుకోవడం దీనికి కారణం. న్యాయస్థానం దంపతులను కోర్టు గది లో పూలు మార్చుకోమని కోరింది. వివాహ వివరాలను తల్లిదండ్రులు నిర్ణయిస్తారని కోర్టు తెలిపింది.

అత్యాచార బాధితురాలికి కోర్టులో జడ్జి ముందే ప్రపోజ్‌ చేసిన నిందితుడు! శిక్ష రద్దు చేస్తూ కోర్టు తీర్పు..
Supreme Court

Updated on: May 15, 2025 | 6:13 PM

అత్యాచారం కేసులో దోషికి విధించిన శిక్షను సుప్రీంకోర్టు గురువారం సస్పెండ్ చేసింది. దీనికి కారణం.. నిందితుడు, బాధితురాలు ఒకరినొకరు వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం దంపతులను కోర్టు గదిలో ఒకరికొకరు పూలు ఇచ్చిపుచ్చుకోవాలని కోరింది. “మేం భోజన సమయంలో వారిద్దరినీ కలిశాం” అని న్యాయమూర్తులు వారిద్దరు పూలు ఇచ్చిపుచ్చుకునే ముందు చెప్పారు.

ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడంతో నిందితుడికి శిక్షను సస్పెండ్ చేస్తూ వారు (అత్యాచార నిందితుడు, బాధితురాలి) ఒకరినొకరు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. వివాహ వివరాలను తల్లిదండ్రులు నిర్ణయిస్తారని వెల్లడించింది. వివాహం వీలైనంత త్వరగా జరుగుతుందని మేం ఆశిస్తున్నామని కోర్టు పేర్కొంది. కాగా మే 6 నాటి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కోర్టు ముందు ఇరు వర్గాలు హాజరయ్యాయి.

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

అదే సమయంలో మరొక కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశం ఇచ్చింది. పిల్లలపై లైంగిక నేరాల కేసులను ప్రత్యేకంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కేసులకు ప్రత్యేక కోర్టుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల విచారణ పూర్తి చేయడానికి నిర్దేశించిన కాలపరిమితిని పాటించడం లేదని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పిబి వరలేలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..