Aadani: హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ..

అదానీ -హిడెన్‌బర్గ్‌ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది.

Aadani: హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ..
Supreme Court Of India

Updated on: Mar 02, 2023 | 11:24 AM

అదానీ -హిడెన్‌బర్గ్‌ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. కమిటీలో ఆరుగురు సభ్యులు ఉండనున్నారు. భారతీయ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీంకోర్టుకు నిపుణుల కమిటీ 2 నెలల్లో నివేదిక అందిస్తుంది. ఈ కమిటీ సభ్యులు విచారణ అనంతరం నివేదికను సీల్డ్‌కవర్‌లోసుప్రీంకోర్టుకు అందచేస్తారు. కాగా, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడడానికి దీనిపై లోతైన దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో నందన్‌ నీలకర్ణి, ఓపీ భట్‌, జస్టిస్‌ జేపీ దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు.

సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా? స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా? అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని కూడా ఆదేశించింది సుప్రీంకోర్టు. 2 నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సెబీని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..